Site icon NTV Telugu

MP Komatireddy: కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం.. పార్టీ చేరికలపై చర్చ

Komati Reddy

Komati Reddy

MP Komatireddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులతో పాటు ఇతర సీనియర్లను కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జానా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉన్నందున కాంగ్రెస్ పార్టీ నేతలు ముందుకు వెళ్లే మార్గాలపై చర్చించనున్నారు. మరోవైపు పార్టీలో చేరికపై కూడా నేతలు చర్చించనున్నారు. ఇతర పార్టీల అసంతృప్తి నేతలను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో కొందరు నేతలు చర్చలు జరుపుతున్నారు.

Read also: Artist Priya: పలుచని చీరకట్టి పరువాలు ఆరబోస్తున్న ప్రియ

పార్టీతో టచ్‌లో ఉన్నదెవరు? పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే వరకు పార్టీ నేతలంతా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం బస్సు యాత్ర చేయాలా.. లేక మరో రూపంలో ప్రజల్లోకి వెళ్లాలా అనే అంశంపై చర్చించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర నిర్వహించింది. ఈ యాత్రలో పార్టీ సీనియర్లంతా పాల్గొన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే తరహాలో యాత్రను నిర్వహించాలని సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
PowerFull Love Story: ప్రేమంటే ఇదేరా.. ప్రియుడ్ని కలిసేందుకు ఊరంతా కరెంట్ కట్ చేసిన ప్రియురాలు

Exit mobile version