Site icon NTV Telugu

Bike on Fire: పోలీసులపై కోపంతో తన బైక్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన వ్యక్తి!

Bike On Fire

Bike On Fire

Bike on Fire: కోటికి పైగా జనాభా ఉన్న భాగ్యనగరంలో ట్రాఫిక్‌ కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఎన్ని ఫ్లైఓవర్లు, ఇతర ప్రత్యామ్నాయాలు చేసినా ఇంకా ఏదో ఒకప్రదేశంలో ట్రాఫిక్‌ నెమ్మదిస్తుంటూనే ఉంటుంది. నిత్యం లక్షలాది మంది తమ అవసరాల కోసం వాహనాలతో రోడ్డెక్కుతుంటారు. ఉరుకులు పరుగుల జీవితంలో రోడ్డు ప్రమాదాలు, తొందలో కొంతమంది, నిర్లక్ష్యంతో మరికింతమంది ట్రాఫిక్‌ రూల్స్‌ చేస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో ప్రజాభద్రత దృష్ట్యా రూల్స్‌ ఖాతరు చేస్తూ ప్రానాలను కోల్పోతున్నారు. దీంతో ప్రజాభద్రత దృష్ట్యా ట్రాఫిక్‌ పోలీసులు ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. రోడ్డు నిబంధనలు పాటించని వారిపై తీవ్ర చర్యలు తీసుకొనేందుకు సిద్ధమయ్యారు. నిబంధలు ఎవరు మీరినా సహించలేదని, ప్రమాదాలకు పాల్పడితే, వాహనం ఇచ్చిన వ్యక్తులు, తల్లిదండ్రులు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.

Read also: North Korea: జపాన్ మీదుగా నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం

18ఏళ్లు నిండి, డ్రైవింగ్‌ వచ్చిన ప్రతిఒక్కరూ లైసెన్సులు పొందాల్సిందేనని తెలిపారు. విధుల్లో భాగంగా అమీర్​పేట మైత్రివనం కూడలి వద్ద ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడ రాంగ్​ రూట్లో వచ్చిన ఎల్లారెడ్డిగూడకు చెందిన అశోక్​ను ఆపి, బండి తాళం తీసుకున్నారు. దీంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన అశోక్​ తనను ఎందుకు ఆపారని వాగ్వాదానికి దిగాడు. పోలీసులు స్పందించకపోవడంతో.. మైత్రీవనంలో తాను నిర్వహించే మొబైల్ షాప్ వద్దకు వెళ్లి.. పెట్రోల్​తో వచ్చాడు. తన బండిపై పోసి నిప్పంటించాడు.. దీంతో బైక్‌ మంటల్లో కాలిపోయింది. అయితే.. ఈ ఘటనపై అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఫైర్ స్టేషన్​ కు సమాచారం అందించారు. హుటా ముటిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు.. ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుని, రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేయడంపై, తమ విధులను అడ్డుకోవటం కింద అశోక్​ పై కేసు నమోదు చేశారు.
North Korea: జపాన్ మీదుగా నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం

Exit mobile version