NTV Telugu Site icon

Rangareddy: ఆరేళ్ళ క్రితం మైనర్ బాలికపై అఘాయిత్యం.. నిండిదితుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష

Untitled 7

Untitled 7

చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేరం చేసిన వాళ్లకు ఏదో రోజు శిక్ష పడి తీరుతుంది అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఓ మానవ మృగం ఇంకిత జ్ఞానం లేకుండా చిన్న పాప అని కూడా చూడ కుండా ఓ మైనర్ బాలిక పైన విచక్షణారహితంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఆ మానవ మృగం చేసిన పాపం ఇన్నాళ్లకు పండింది. అతనికి కోర్టు శిక్ష విధించింది. వివరాలలోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా లోని మంచాల మండలం లొంని దాతపల్లి గ్రామానికి చెందిన సపావత్ అంజిత్ కుమార్(28) 2017 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Read also:Supreme Court: ఆత్మహత్యకు ప్రేరేపించినా శిక్షకు అర్హులే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రల ఫిర్యాదు మేరకు మంచాల మండలంకి చెందిన పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ కేసు పైన విచారణ కొన్ని సంవత్సరాలు నడిచింది. అయితే తాజాగా బాధితులు ఈ ఘటన కు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను ఎల్బీనగర్ లోని పొక్సో స్పెషల్ కోర్టుకు సమర్ఫించారు. ఈ నేపథ్యంలో సాక్ష్యాధారాలను పరిశీలించిన ఎల్బీనగర్ లోని పొక్సో స్పెషల్ కోర్టు నిందితుడిని నేరస్థునిగా పరిగణించింది. కాగా విచారణలో విచక్షణారహితంగా మైనర్ బాలిక పైన దారుణానికి పాలపడినట్లు రుజువు కావడంతో ఎల్బీనగర్ లోని పొక్సో స్పెషల్ కోర్టు నెరస్థుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. కాగా దాదాపు 6 సంవత్సరాల తరువాత నేరస్థునికి శిక్షపడడంతో బాలిక కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.