NTV Telugu Site icon

Shadnagar Crime: ఒంటరి మహిళలే అతని టార్గెట్.. మాయమాటలతో నమ్మించి..

Man Killed Woman Robbed

Man Killed Woman Robbed

A Man Killed Woman And Robbed Her In Shadnagar: ఒంటరి మహిళలే అతని టార్గెట్. కల్లు కాంపౌండ్లు, మద్యం దుకాణాల వద్ద ఉన్న ఒంటరి మహిళలకు మాయమాటలు చెప్పి, వారి వద్ద ఉన్న నగలను దోచుకోవడమే అతని వృత్తి. ఒకవేళ ఎవరైనా అతడ్ని ప్రతిఘటిస్తే.. వారిని చంపడానికి కూడా వెనకాడని నైజం అతనిది. ఇటీవల ఓ మహిళ ప్రతిఘటించినందుకు.. అతడు బండరాయితో కొట్టి ఆమెను చంపేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలు దొంగలించాడు. మరో మహిళను సైతం గాయపరిచి.. ఆమె వద్దనున్న నగలు, సెల్‌ఫోన్, డబ్బులు తీసుకొని పారిపోయాడు. చివరికి పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించారు.

Chandrayaan-3: ఇండియాకు చంద్రయాన్-3 గేమ్ ఛేంజర్.. మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్..

శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని బంగారం పల్లి గ్రామానికి చెందిన దారముని గంగమ్మ (40) షాద్‌నగర్‌లోని ప్రశాంత్ నగర్ కాలనీలో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఈ నెల 8వ తేదీన ఉదయం ఇంట్లో నుండి బయటకు వెళ్లిన గంగమ్మ.. తిరిగి ఇంటికి రాలేదు. బహుశా బంధువుల ఇంటికి వెళ్లి ఉండొచ్చని ఆమె భర్త వెంకటయ్య అనుకున్నారు. కానీ.. ఆరా తీయగా అక్కడ లేదని తెలిసింది. దీంతో.. ఆమె ఆచూకీ కోసం గాలించడం మొదలుపెట్టాడు. ఆమె ఆచూకీ ఎక్కడా దొరక్కపోవడంతో.. ఈనెల 11న షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే విచారణ చేపట్టగా.. హైటెక్ సిటీ కాలనీ పరిసరాల్లో ఉన్న ముళ్ల పొదల్లో ఒక మహిళా శవాన్ని గుర్తించారు. ఆ మృతదేహం తన భార్యదేనని వెంకటయ్య నిర్ధారించడంతో.. పోలీసులు హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. గంగమ్మది హత్యేనని తేల్చారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం మెట్టుగడ్డ తండాకు చెందిన జర్పుల హీర్యా అనే వ్యక్తే ఆమెని చంపినట్టు గుర్తించారు.

Sabitha Indra Reddy: మంత్రి బొత్సవి అవగాహన లేని వ్యాఖ్యలు.. ఆ స్థాయి మీకు లేదు

కల్లు దుకాణం వద్ద గంగమ్మను కలిసిన హీర్యా అనే వ్యక్తి.. మాయమాటలు చెప్పి, ఆమెని హైటెక్ సిటీ కాలనీ పరిసరాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కూర్చొని మద్యం సేవించారు. అనంతరం గంగమ్మ మత్తులోకి జారిపోయిందని అనుకుని, ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకునేందుకు హీర్యా ప్రయత్నం చేశాడు. అయితే.. గంగమ్మ ప్రతిఘటించడంతో, అతడు పక్కనే ఉన్న బండరాయితో ఆమె తలపై మోదాడు. దాంతో ఆమె మృతి చెందింది. గంగమ్మ చనిపోయాక.. ఆమె కాళ్లకు ఉన్న 48 తులాల కడియాలను యాక్సిస్ బ్లేడ్‌తో కోసి దొంగిలించాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించి, అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించారు. ఇదే తరహాలోనే అతడు ఈనెల 11వ తేదీ కూడా ఒంటరి మహిళపై దాడి చేశాడు. పట్టణంలోని కూలీల అడ్డా వద్ద ఒంటరిగా ఉన్న మహిళను మాయమాటలు చెప్పి, ఎలికట్ట గ్రామం దగ్గరున్న వెంచర్‌లోకి తీసుకెళ్లాడు. ఆమెను గాయపరిచి ఆమె వద్ద ఉన్న ముక్కుపుడకలను, సెల్‌ఫోన్‌ను, రూ.2000 నగదు తీసుకొని పరారైనట్టు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.