NTV Telugu Site icon

Warehouse explosion: ముసాపేట గోదాం పేలుడు ఘటనపై యజమాని క్లారిటీ.. మృతుడు నా వద్ద..

Nager

Nager

Warehouse explosion: స్క్రాప్ గోదాం లో గోడౌన్ లోని స్క్రాప్ ను ఆటోలో లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంబవించింది. పేలుడు దాటికి తీవ్ర గాయాల పాలైన వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కెమికల్స్ ఖాళీ డబ్బాలను ఆటో టాటా ఏస్ వాహనం లో లోడ్ చేస్తుండగా కెమికల్ ఉన్న డబ్బా వాహనంపై నుండి కింద పడటంతో.. అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసాపేట హెచ్ పి రోడ్డు లో చోటుచేసుకుంది.

Read also: CM KCR: రాష్ట్ర, దేశ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు

ముషీరాబాద్ బోలక్ పూర్ కు చెందిన మహమ్మద్ నజీర్ , తండ్రి ఇస్మాయిల్ స్క్రాబ్ కొనుగోలు చేస్తుంటారు. ఈనేపథ్యంలోనే రోజూలాగానే ముసాపేట ప్రాంతంలో డబ్బాలను లోడ్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే స్క్రాబ్ డబ్బా ఒక్కసారిగా క్రింద పడిపోయింది. అయితే.. నజీర్ పై పడటంతో ఒక్కసారిగా పేలుడు సంబవించింది. నజీర్‌కు బలమైన గాయాలు అయ్యాయి. అక్కడే వున్న వారు నజీర్‌ను వెంటనే స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ నజీర్‌ ఆసుపత్రిలోనే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్క్రాబ్‌ డబ్బా కిందపడటంతో ఒక్కసారిగా పేలుడు సంబవించిందని నజీర్‌ కు బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు దర్యాప్తులో వివరించారు.

Read also: Attack on Petrol Bunk: ఇదెక్కడి ఘోరం.. బైక్‌ లో పెట్రోల్‌ పోసి డబ్బులు అడిగినందుకు చంపేశారు

కాగా.. ఎన్ టివి తో స్క్రాప్ గోదాం యజమాని భాస్కర్ మాట్లాడుతూ.. స్క్రాప్ ను టాటా ఏ సి ఆటో లో లోడ్ చేస్తుండగా పేలుడు సంభవించిందని స్పష్టం చేశాడు. పేలుడు సంభవించినప్పుడు మృతుడు నజీర్ తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని అన్నారు. చాలా పెద్ద శబ్దం వచ్చిందని దీంతో అక్కడున్న వారందరూ భయంతో పరుగులు తీశామని తెలిపారు. కెమికల్ బ్లాస్ట్ వల్ల జరిగిందా లేక ఘటన స్థలంలో ఉన్న హై టెన్షన్ వయర్ స్తంభం, ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ తాకడం వల్ల జరిగిందా తెలియదని దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఆటో లోడ్ చేసినప్పుడు ఎలాంటి కెమికల్ డబ్బాలు లేవని స్పష్టం చేశారు. అందులో కాలి డబ్బాలు మాత్రమే ఉన్నాయని కానీ పేలుడు ఎలా సంభవించింది అనేది ప్రశ్నార్థకంగా ఉందని తెలిపారు. మృతుడు నజీర్‌ తన వద్ద 10 సంవత్సరాలుగా మృతుడు బిజినెస్ చేస్తున్నాడని చాలా మంచి వ్యక్తి అని అన్నారు. పేలుడు దాటికి తీవ్ర గాయాల పాలైన నజీర్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందాడని యజమాని భాస్కర్‌ వెల్లడించారు.
Black Grapes: నల్లద్రాక్షను ఖాళీ కడుపున తింటే ప్రమాదమా? నిజమెంత?

Show comments