NTV Telugu Site icon

Siddipet: ఇంటిదోషం తొలగిస్తానని నగలతో ఉడాయించిన హిజ్రా

Mastan Hijra

Mastan Hijra

Siddipet: మూఢనమ్మకాలు మనషులకు పట్టి పీడుస్తున్నాయి. మూఢనమ్మానికి బానిసలై జీవితాలను నాసనం చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను ఆసరాగా తీసుకుని ఎదుటివారు సులువుగా మోసం చేస్తున్నారు. దోషాలు, వివాహాలు, డబ్బు ఆశ చూపించడం ఇలా రకరకాలుగా వారిని భయభ్రాంతులు చేసి వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచేసుకుంటున్నారు. ఎదుటి వారు చెప్పేది నిజమా? అపద్దమా అనే ఆలోచన లేకుండా వారి మాటలకు తానా అంటే తందానా అనే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. చేతులు కాలాక ఆకుటు పట్టుకున్న లాభం లేదని మరిచిపోతున్నారు. అంతా ఖాళీ అయ్యాక చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లా చేర్యాలలో చోటుచేసుకుంది. ఇంటి దోషం తొలగిస్తానని ఓ హిజ్రా నగలతో ఉడాయించిన ఘటన చేర్యాలలో సంచలనంగా మారింది.

Read also: Photoshoot: పురుషుల నగ్నత్వాన్ని చిత్రీకరిస్తున్న మహిళ

చేర్యాలకు చెందిన మధు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఏపీలోని విజయవాడకు చెందిన అబిద్ షేక్ మస్తాన్ అనే హిజ్రాతో కొన్నాళ్లుగా పరిచయం ఏర్పడింది. ఓ సారి చేర్యాలలోని ఇంటికి మస్తాన్ ని మధు తీసుకెళ్లాడు. ఇంటిని చూసిన మస్తాన్ హిజ్రా ఓ ప్లాన్ వేశాడు. ఇంటిని అంతా గమనించి, ఇంట్లో నగలు, వెండిని చూసి ఎత్తుకెళ్లేందుకు సమయం కోసం వెయిట్ చేశాడు. సమయం రానే వచ్చింది. ఇంట్లో దోషముందని, అమ్మవారిని నగలతో అలంకరించి పూజ చేస్తే దోషం పోతుందని మధుని.. హిజ్రా మస్తాన్ నమ్మించాడు. దీంతో హిజ్రాను నమ్మిన మధు ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, 5 తులాల వెండి గొలుసులు తీసి విగ్రహానికి పెట్టి హిజ్రా మస్తాన్ పూజ చేశారు. పూజ అనంతరం అమ్మవారి విగ్రహాన్ని పాతి పెట్టి నగలను తీయాలని నమ్మించి మధుని ఓ చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు.

మధుని గుడి దగ్గర కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి హిజ్రా మస్తాన్ నగలతో ఉడాయించాడు. వెనక్కి తిరిగి మధు చూడగా అక్కడ హిజ్రా కనపించలేదు. చుట్టుపక్కల వెతికిన హిజ్రా జాడ లేకపోవడంతో మోసపోయానని నమ్మిన మధు పోలీసులకు ఆశ్రయించాడు. తనను హిజ్రా మోసం చేసి నగలతో పరారయ్యాడని వాపోయాడు. తను ఎంతో కష్టపడిన సొమ్మును హిజ్రా మస్తాన్ నమ్మించి తీసుకుపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సొమ్మును తనకు ఇప్పించాలని, హిజ్రాకు తగిన బుద్ది చెప్పాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హిజ్రా మస్తాన్ ఎక్కడ ఉండే వాడని? ఎందుకు మధునే టార్గెట్ చేశాడని? మస్తాన్ వెనుకాల ఇంకెవరిదైనా హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి వారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Mukesh Ambani: లగ్జరీ ఇల్లు అమ్మేసిన ముకేశ్ అంబానీ..