Site icon NTV Telugu

Child Marriage: నిజామాబాద్‌ లో దారుణం.. 13 ఏళ్ల బాలికకు 45 ఏళ్ల వ్యక్తితో వివాహం

Child Marrige

Child Marrige

Child Marriage: అతనికి 18,15 సంవత్సరాల వయస్సు గల కుమారులు ఉన్నారు! భార్య చనిపోయింది. తన కూతురి వయసున్న 13 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు! ఈ బాల్య వివాహానికి గ్రామస్తులు సహకరించారు. పోలీసులు పిలుస్తున్నారని తెలిసి పెళ్లి తరువాత అమ్మాయిని తీసుకుని కారులో ఎటో వెళ్లిపోయాడు.
బాల్య వివాహాల నివారణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం సున్నా. ఈఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Kunamneni: పొత్తులు పొత్తులే… పోరాటాలు పోరాటాలే

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అబ్బాపూర్ (బి) తండాలో అర్థరాత్రి 13 ఏళ్ల మైనర్ బాలికను సాయిబ్‌రావు అనే 45 ఏళ్ల వ్యక్తికి బాల్య వివాహం చేశారు. అయితే సాయిబ్‌రావుకు అప్పటికే వివాహమై భార్య మృతి చెందింది. ఆయనకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి తన కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గ్రామస్థుల సహకారంతో ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. బాధిత బాలిక చదువును మధ్యలోనే మానేసినట్లు సమాచారం. అయితే శుక్రవారం రాత్రి సాయిబ్‌రావుతో ఆమెకు పెళ్లి చేయాలని బంధువులు నిర్ణయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ టీచర్‌తోపాటు పలువురు వ్యక్తులు అదే రోజు రాత్రి జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునేలోపే పెళ్లి జరిగింది. అయితే పోలీసులు వస్తున్నారనే ముందస్తు సమాచారంతో.. సాయిబ్ రావు పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. సాయిబ్‌రావు ఎక్కడికి వెళ్లాడో తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటనపై చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు, ఐసీడీఎస్‌ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి హైమద్‌ పాషా అధికారులకు ఫిర్యాదు చేశారు.
Snake In ATM: ఏటీఎంలో ఏసీకి ‘చిల్’ అవుతున్న ‘స్నేక్ రాజ్’

Exit mobile version