Site icon NTV Telugu

Rajanna Siricilla: క్రిస్మస్ వేడుకల్లో విషాదం.. గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి

Rajanna Sirisilla

Rajanna Sirisilla

Rajanna Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. తాళ్లపల్లి శంకర్-సరిత దంపతులకు ఇద్దరు కుమారులు జస్వంత్, సుశాంత్ (13). దంపతులిద్దరూ కూలీ పనులు చేస్తుండగా ఇద్దరు కుమారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. జస్వంత్ కోనరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండగా, సుశాంత్ ముస్తాబాద్ మండలంలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం క్రిస్మస్ పండుగకు సుశాంత్ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. సోమవారం ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ ఆనందంగా డాన్స్ ఆడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా పండుగను చరుపుకుంటున్నారు. ఇంతలోనే సుశాంత్ ఒక్కసారిగా కిందకు పడిపోయాడు.

Read also: Mutual Funds :మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి..

సుశాంత్ కింద పడిపోవడంతో అందరూ షాక్ తిన్నారు. అక్కడే వున్న కుటుంబసభ్యులకు కాసేపు ఏమీ అర్థంకాలేదు. ఊరిపి ఆడకపోవడంతో కంగారు పడిన కుటుంబసభ్యులు సుశాంత్ ను హుటాహుటిన సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స పొందుతూ సుశాంత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్రిస్మస్ వేడుకలతో కలకలలాడిన వారి కుటుంబంలో ఒక్కసారిగా అంధకారం నెలకొంది. అప్పుడు అందరితో ఆడుతూపాడుతూ వున్న కొడుకు ఛాతీ నొప్పతో మృతి చెందడం కుటుంబంలో విషాదం నెలకొంది. అంతచిన్న వయస్సులో సుశాంత్ కు ఛాతీ నొప్పి రావడం ఏంటని గుండెపగిలేనా రోదించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కేతిరెడ్డి అరుణ కోరారు.
Mutual Funds :మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి..

Exit mobile version