Heavy Fog: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. చలితో ప్రజలు వణికిపోతున్నారు. అదే సమయంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పొగమంచు కారణంగా నల్గొండ జిల్లాలో ఇద్దరు, వికారాబాద్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పొగమంచు విమాన ప్రయాణానికి ఆటంకం కలిగిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పైలట్లకు రన్‌వే కనిపించకపోవడంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు విమానాలను నిలిపివేశారు.
ఆ సమయంలో 35 జాతీయ, అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించారు. ఆ విమానాలను విజయవాడ, బెంగళూరు, ముంబై, నాగ్‌పూర్ నగరాలకు మళ్లించారు. ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ చేరుకోవాల్సిన గోవా, తిరువనంతపురం, చండీగఢ్ విమానాలను విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి పంపించారు. పొగమంచు కమ్ముకోవడంతో ఉదయం 9 గంటల తర్వాత సర్వీసులు ప్రారంభించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దారి మళ్లించిన విమానాలు తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాయి. అయితే పొగమంచు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ఏజెన్సీ పై చలి తీవ్రత పెరిగింది. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లో 8.6 డిగ్రీలు గా నమోదుకాగా.. అదిలాబాద్ జిల్లా సొనాలలో 9.9 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 10.6డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా నిల్వాయిలో 12.2గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబాబాద్ జిల్లా పొగ మంచు కమ్మకుంది. పొగ మంచు కారణంగా రహదారులపై వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైట్స్ వేస్తే తప్ప దారి కనిపించని పరిస్థితులు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Mega Allu Fyamily : మెగా హీరోలందరూ ఒక్కచోట కలిస్తే పండగే.. క్రిస్మస్ ఫొటోస్ వైరల్..