Malakpet Crime: హైదరాబాద్‌లోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొండెం లేని తల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. కేసు విచారణకు రంగంలోకి 8 బృందాలు ఎంట్రీ ఇచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ లు పోలీసులు పరిశీలీస్తున్నారు. మలక్ పేట్ పోలిస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతి చెందిన మహిళ 35-40 ఏళ్ళ మధ్యలో ఉంటుందని అంచనా వేశారు. చనిపోయిన మహిళ ముస్లిం మహిళగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Medtronic’s: హైదరాబాద్ కు క్యూకడుతున్న విదేశీ కంపెనీలు.. రూ.3 వేల కోట్లతో ఆర్ అండ్ డీ సెంటర్
హైదరాబాద్‌లోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగూడలో మొండెం లేని గుర్తు తెలియని మహిళ తల లభ్యం అవడంతో కలకలం రేపింది. ఓ నల్ల కవర్‌లో మహిళ తల నుంచి మూసి పరివాహక ప్రాంతంలో విసిరేసి వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు, స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలను స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.హత్య చేసి తలను తెచ్చి పడవేశారని భావిస్తున్నారు. హత్యకు గురైన మహిళ ముస్లిం మహిళగా అనుమానిస్తున్నారు పోలీసులు.. అయితే, మహిళను ఎక్కడ హత్య చేశారు.. తల ఇక్కడ పడేశారు.. మరి మొండెం ఎక్కడ ఉంది? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.. వివరాలు సేకరించడంలో భాగంగా క్లూస్ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు మలక్‌పేట్ పోలీసులు. మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఇలాంటి ఘటనే నగరంలో చోటుచేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 12న హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడ సమీపంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు మహిళ మృత దేహాన్ని ప్లాస్టిక్ సంచిలో వేసి వదిలేశారు. తాజాగా ఈ ఘటన జరగడంతో నగర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Mrunal Thakur: బాబోయ్ మృణాల్ ఇలా రెచ్చిపోతే మా పరిస్థితి ఏంటి