NTV Telugu Site icon

Pending Challan: త్వరపడండి.. ఇవాళ్టితో ముగియనున్న భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌

Pending Challan

Pending Challan

వాహనదారులు త్వరపడండి… ఇవాళ్టితోనే పెండింగ్‌ చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ల ఆఫర్ ముగిసిపోనుంది.. తెలంగాణ సర్కార్ ప్రకటించిన పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్.. మార్చి 31వ తేదీతో ముగిసే సమయంలో.. ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 15వ తేదీ వరకు గడువు పెంచుతున్నామని హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించిన విషయం విదితమే.. అయితే, పొడిగించిన గడువు ఇవాళ్టితో ముగియనుంది.. అంటే, డిస్కౌంట్‌పై ట్రాఫిక్ చలాన్ క్లియరెన్స్ కు నేడే ఆఖరి రోజు.. నేటితో డిస్కౌంట్ ఆఫర్ ముగియనుంది.. ఇక, రేపటి నుండి యథావిథిగా చలాన్ రుసుము వసూలు చేయబుతున్నారు.

Read Also: Petrol: బంపరాఫర్.. అక్కడ రూపాయికే లీటర్‌ పెట్రోల్..

మార్చి 1వ తేదీ నుండి మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రకటించారు ట్రాఫిక్‌ పోలీసులు.. మధ్యలో ఏప్రిల్ 15 వరకు పొడిగించారు.. కానీ, మరోసారి పొడిగించే అవకాశమే లేదని చెబుతున్నారు ట్రాఫిక్‌ అధికారులు.. ఇప్పటికే ఈ ఆఫర్‌కు భారీ స్పందన వచ్చింది.. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం వాహనదారులు తమ పెండింగ్‌ చలాన్స్‌ను క్లియర్‌ చేసుకున్నారు.. 250 కోట్ల రూపాయలను ఫైన్ రూపంలో వాహనదారులు చెల్లించారు.. మరోసారి ఈ ఆఫర్ పొడిగింపు ఉండదు అని స్పష్టం చేస్తున్నారు పోలీసులు.. కాగా, ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్లలో భాగంగా.. టూ వీలర్/ త్రీ వీలర్‌ వెహికల్స్ పై ఉన్న చలాన్లపై 75 శాతం డిస్కౌంట్ ప్రస్తుతం అందుబాటులో ఉండగా… ఫోర్ వీలర్ , హెవీ వెహికల్స్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్, కరోనా సమయంలో మాస్కు పెట్టుకోని కారణంగా వేసిన కేసులలో 90 శాతం డిస్కౌంట్ ఇచ్చింది.. ఇక, ఆటోలపై ఉన్న చలాన్లు 70 శాతం డిస్కౌంట్ తో క్లియర్‌ చేసుకునే అవకాశం ఉంది.. ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్‌ ఉన్నందున.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. నెట్ బ్యాంకింగ్ లేదా పేటియం ద్వారా.. మీ దగ్గరలోని మీసేవ కేంద్రంలో సంప్రదించి గాని మీ వెహికల్ పై ఉన్న పెండింగ్ చలాన్స్ ను క్లియర్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. త్వరపడండి.. మీ పెండింగ్‌ చలాన్స్‌ క్లియర్‌ చేసుకోని ఉపశమనం పొందండి..