Amit Shah: నేడే ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 74వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నారు. ఆ బ్యాచ్‌లో మొత్తం 195 మంది శిక్షణ పొందగా, వారిలో 41 మంది మహిళలు ఉండగా.. 195 మందిలో 166 మంది ఐపీఎస్ అధికారులు, వారిలో 37 మంది మహిళలు, మిగిలిన 29 మంది విదేశీ క్యాడెట్లు. విదేశీయుల్లో నేపాల్, భూటాన్, మాల్దీవులు, మారిషస్ దేశాలకు చెందిన క్యాడెట్లు శిక్షణ తీసుకున్నారు. కాగా 74వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రామానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అమిత్ షా. కవాతు ప్రదర్శనను వీక్షించిన అనంతరం అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. భోజన విరామం అనంతరం తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు.
Read also: Prabhas: ఏం ఉన్నాడు రా బాబు…
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
కరోనా వల్ల 74వ బ్యాచ్ ఆలస్యం కావడంతో ఈసారి 75వ బ్యాచ్‌కి అకాడమీలో శిక్షణ సాగుతోంది. ఇక.. ప్రస్తుతం అకాడమీలో సుమారు 400 మంది క్యాడెట్లు ఉన్నా.. అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన కేరళకి చెందిన కేఎస్ షెహన్షా, పాసింగ్ అవుట్ పరేడ్ మాండర్‌గా వ్యవహరించనున్నారు. అంతే కాకుండా.. షెహన్షా సివిల్స్‌లో ఆరు ప్రయత్నాల్లో విఫలమైనా, ఏడో ప్రయత్నంలో 142వ ర్యాంకు సాధించారు. కాగా.. ఐఏఎస్ దక్కే అవకాశమున్నా పోలీస్ ఉద్యోగంపై ఇష్టంతో ఐపీఎస్‌ను ఆమె ఎంచుకున్నార.. మెకానికల్ విభాగంలో బీటెక్ పూర్తిచేసిన తర్వాత.. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అథ్లెటిక్స్‌లో శిక్షణ పొంది 8ఏళ్లలో 30 రాష్ట్ర, 14 జాతీయ పతకాలు సాధించారు. అనంతరం సీఐఎస్ఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్‌గా ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్‌లో డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్‌గా పనిచేశారు. ఇక ప్రస్తుతం ఆ బ్యాచ్ నుంచి తెలంగాణకు ఐదుగురు, ఏపీకి ఇద్దరు ఐపీఎస్‌లను కేటాయించారు..సమాజంలో ఉన్న సమస్యలు పూర్తి స్థాయిలో పారదోలేందుకు తమవంతు కృషి చేస్తామని క్యాడెట్లు తెలిపారు.
Shivratri Brahmotsavam 2023: శ్రీశైలంలో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!