Site icon NTV Telugu

Amit Shah: నేడే ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి

Amit Shah

Amit Shah

Amit Shah: సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 74వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నారు. ఆ బ్యాచ్‌లో మొత్తం 195 మంది శిక్షణ పొందగా, వారిలో 41 మంది మహిళలు ఉండగా.. 195 మందిలో 166 మంది ఐపీఎస్ అధికారులు, వారిలో 37 మంది మహిళలు, మిగిలిన 29 మంది విదేశీ క్యాడెట్లు. విదేశీయుల్లో నేపాల్, భూటాన్, మాల్దీవులు, మారిషస్ దేశాలకు చెందిన క్యాడెట్లు శిక్షణ తీసుకున్నారు. కాగా 74వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రామానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అమిత్ షా. కవాతు ప్రదర్శనను వీక్షించిన అనంతరం అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. భోజన విరామం అనంతరం తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు.

Read also: Prabhas: ఏం ఉన్నాడు రా బాబు…

కరోనా వల్ల 74వ బ్యాచ్‌ ఆలస్యం కావడంతో ఈసారి 75వ బ్యాచ్‌కి అకాడమీలో శిక్షణ సాగుతోంది. ఇక.. ప్రస్తుతం అకాడమీలో సుమారు 400 మంది క్యాడెట్లు ఉన్నా.. అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన కేరళకి చెందిన కేఎస్ షెహన్‌షా, పాసింగ్ అవుట్ పరేడ్‌ మాండర్‌గా వ్యవహరించనున్నారు. అంతే కాకుండా.. షెహన్‌షా సివిల్స్‌లో ఆరు ప్రయత్నాల్లో విఫలమైనా, ఏడో ప్రయత్నంలో 142వ ర్యాంకు సాధించారు. కాగా.. ఐఏఎస్ దక్కే అవకాశమున్నా పోలీస్‌ ఉద్యోగంపై ఇష్టంతో ఐపీఎస్​ను ఆమె ఎంచుకున్నార.. మెకానికల్ విభాగంలో బీటెక్‌ పూర్తిచేసిన తర్వాత.. స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో అథ్లెటిక్స్‌లో శిక్షణ పొంది 8ఏళ్లలో 30 రాష్ట్ర, 14 జాతీయ పతకాలు సాధించారు. అనంతరం సీఐఎస్​ఎఫ్​లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా ఇండియన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్ సర్వీస్‌లో డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌గా పనిచేశారు. ఇక ప్రస్తుతం ఆ బ్యాచ్‌ నుంచి తెలంగాణకు ఐదుగురు, ఏపీకి ఇద్దరు ఐపీఎస్​లను కేటాయించారు..సమాజంలో ఉన్న సమస్యలు పూర్తి స్థాయిలో పారదోలేందుకు తమవంతు కృషి చేస్తామని క్యాడెట్లు తెలిపారు.
Shivratri Brahmotsavam 2023: శ్రీశైలంలో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Exit mobile version