Site icon NTV Telugu

TSPSC: టీఎస్పీఎస్సీ కేసులో సిట్ దర్యాప్తు.. 74 కు చేరిన అరెస్ట్‌ల సంఖ్య

Tspsc

Tspsc

TSPSC: టీఎస్ పీ ఎస్ సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు అరెస్ట్‌ ల సంఖ్య 74 కు చేరింది. నిందితుడు పొల రమేష్.. అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నాపత్రాన్ని 30 మందికి విక్రయించినట్టుగా సిట్ గుర్తించింది. పోల రమేష్ ఇచ్చిన సమాచారం తో మరో పది మంది అరెస్ట్ చేశారు సిట్‌ అధికారులు. ఐదు ప్రత్యేక బృందాలతో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఒక్కో నిందితుడిని విచారిస్తే… కొత్త పేర్లు బయట పడుతుండటంతో వారిని అదుపులో తీసుకుని విచారణ చేపట్టింది. చైన్ సిస్టం మాదిరి ప్రశ్నాపత్రాలు అమ్మినట్టు సిట్ గుర్తించింది. తాజాగా అరెస్ట్ అయిన 10 మంది నిందితులను కస్టడీలోకి తీసుకుని సిట్ బృందం విచారణ చేపట్టింది. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన కొంతమంది…ఇంకా అజ్ఞాతం లోనే వున్నట్టు సిట్ గుర్తించింది. అరెస్ట్ ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

Read also: Cruel Father: ఛీ వీడు అసలు తండ్రేనా? భార్యపై అనుమానంతో ఇద్దరు బిడ్డలను చంపి..

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేయించి అరెస్ట్ అయిన పోల రమేష్ కు నిందితులకు సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ ను 30 మందికి విక్రయించిన పోల రమేష్ వద్ద నుంచి సేకరించిన సమాచారంతో పేపర్ కొనుగోలు చేసిన నిందితులను అరెస్టు చేస్తూ వస్తున్నారు సిట్ అధికారులు. ఇటీవల మున్సిపల్ ఏఈ పరీక్షలో 16వ ర్యాంకు సాధించిన నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నాగరాజు.. ప్రభుత్వ ఉద్యోగి రమేష్ నుంచి పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసి ర్యాంకు సాధించినట్లు గుర్తించారు.
Minister KTR: ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ ప్రకటన.. ఇవాళ, రేపు బీఆర్‌ఎస్‌ నిరసన

Exit mobile version