Panchaloha Idol Stolen: దొంగలు గుడిలో లింగాన్ని సైతం వదలడం లేదు. దేవుడంటే భక్తి, భయం ఉంటుంది అంటారు కానీ.. భక్తి మాట దేవుడు ఎరుగు భయం అనేది అస్సలు లేదు.. దేవుడి ముందు మొక్కులు చెల్లించుకుని కోరిన కోర్కెలు తీర్చాలని వేడుకోవడం కరువైంది. కానీ.. గుడిలో వున్న లింగాన్ని సైతం ఎత్తుకెళ్లిన ఘటనలు మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో రెండు ఆలయాల్లో దుండగులు చొరబడటం కలకలం రేపింది. ఊరిలో కొలువైన వేణుగోపాలస్వామి ఆలయంలో 500 ఏళ్ల నాటి 20కిలోల ఆండాళమ్మ పంచలోహ విగ్రహం చోరీకి గురైంది. అయితే.. ఆ విగ్రహం విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా! కాగా.. ఇదే గ్రామంలో మహంకాళి అమ్మవారి ఆలయం తలుపులు పగులగొట్టి విగ్రహం చేతులను ధ్వంసం చేశారు. అయితే.. ఒకే గ్రామంలో రెండు ఆలయాల్లో దొంగతనాలు జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Viral News : ఇదే కదా వృత్తిపట్ల నిబద్ధత.. విశాఖ వైద్యులపై ప్రశంసలు
ఆలయానికి ప్రధానద్వారం తలుపులకు తాళాలు అలాగే ఉన్నా.. దుండగులు గోడ దూకి ఈదారుణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే.. మరోవైపు శివ్వంపేట మండల కేంద్రంలో కట్టమైసమ్మ ఆలయంలోనూ దొంగలుపడ్డారు. ఈ.. ఆలయంలోని వెండి ఆభరణాలను దొంగిలించారు. అయితే.. గతంలోనూ ఇదే మండలంలోని చింతల్‌లో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు దొంగలను పట్టుకోలేదన్న విమర్శలు పోలీసులపై ఉన్నాయి… పోలీసులు పాట్రోలింగ్ నిర్వహించకపోవడం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Women Passengers Fight in Local Train: ట్రైన్‌లో సీటు విషయంలో మహిళల రచ్చ.. జుట్లు పట్టుకొని కొట్టుకున్నారుగా..