NTV Telugu Site icon

New police stations: జంటనగరాల్లో 40 కొత్త పోలీస్ స్టేషన్లు.. జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్‌

Telangana Police

Telangana Police

New police stations: హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్ శాఖ తమ పావులు కలుపుతుంది. ఇప్పటికే భారీ స్థాయిలో సిబ్బందిని పెంచిన సరైన రీతిలో ఫలితాలు రావడం లేదు. దీనిని దృష్టిలో పెంచుకునే హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ తో పాటుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జంట నగరాల్లో ఏకంగా 40 పైగా పోలీస్ స్టేషన్లో కొత్తవి రాబోతున్నాయి. అంతేకాకుండా భారీ స్థాయిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా వస్తున్నాయి. దీనికి తోడు ప్రతి జోన్లో కూడా మహిళ పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు డ్రగ్స్ కట్టడికో కొరకు నార్కోటిక్ బ్యూరోతో పాటుగా సైబర్ క్రైమ్ కంట్రోల్ కోసం సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కూడా చకచగా జరిగిపోతున్నాయి. రానున్న 15 రోజుల్లో కొత్త పోలీస్ స్టేషన్లు ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎందుకు సంబంధించి జంట పోలీస్ కమిషనర్లు ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. మరోవైపు ఆరు కొత్త డిసీపీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాదు నగరంలో ఏకంగా 11 ఏసీబీ స్థాయి అధికారులు పోస్టులను అప్డేట్ చేశారు. దేనికి తోడు 14 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు.

మరోవైపు 14 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కూడా నిర్మించబోతున్నారు. అదే తరహాలో ప్రతి జోన్ లో కూడా మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి తోడు మరొక ఐదు పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నూతనంగా నిర్మించిన సెక్రటేరియటుకు అనుకొని కొత్తగా సచివాలయ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నారు. అదే తరహాలో నిత్యం బందోబస్తులతో సతమతమవుతున్న గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కి కొద్దిగా భాగాన్ని కట్ చేసి దోమలు గూడ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నారు. దీని పరిధిలో ధర్నా చౌక్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రాంనగర్, వారాసిగూడ ప్రాంతాలు విపరీతంగా జనాభా పెరిగిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా రెండు పోలీస్ స్టేషన్లో వస్తున్నాయి. కవడిగుడ కూడా కొత్తగా పోలీస్ స్టేషన్లో వస్తున్నాయి. అదే తరహాలో జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పంజాగుట్ట ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో భారీగా మార్పులు చేశారు. ఈ పరిధిలో మరో కొత్త నాలుగు పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. బోరబండ ,మధురానగర్, ఫిలింనగర్ ,రహమత్ నగర్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు మాసబ్ ట్యాంక్ తో పాటుగా మరికొన్ని పోలీస్ స్టేషన్లో కొత్తగా వస్తున్నాయి.

ట్రాఫిక్కు నిత్యం పెరిగిపోతుంది దీనిలో దృష్టిలో పెట్టుకొని 14 కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు కూడా జరిగిపోతుంది చాలావరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు తక్కువగా ఉన్నాయి దీనిలో దృష్టిలో పెట్టుకొని 14 కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో నానాటికి జనాభా పెరిగిపోతుంది అభివృద్ధి కూడా అంతే స్థాయిలో పెరిగిపోతుంది దీనిని దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా పెద్ద స్థాయిలో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పరిధిలో మూడు కొత్త జోన్లు ఏర్పాటు చేశారు మేడ్చల్ రాజేంద్రనగర్ ఏర్పాటుచేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు పోలీస్ స్టేషన్లో పరిధిలో కూడా జనాభా విపరీతంగా పెరిగిపోయింది దీన్ని దృష్టిలో పెట్టుకొని సైబరాబాద్ పరిధిలో మొత్తం ఆరు కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు దీనికి తోడు మరొక ఆరు ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అల్లాపూర్ మోకిలా ,అత్తాపూర్, సూరారం, ఏర్పాటు చేశారు. అదే మాదిరిగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా కొత్తగా మహేశ్వరం జోన్ ను ఏర్పాటు చేశారు. దీని పరిధిలో కూడా రెండు పోలీస్స్టేషన్లో నిర్మించబోతున్నారు. మొత్తంగా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో 40 కొత్త పోలీస్ స్టేషన్లు రాబోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికీ 110 పోలీస్ స్టేషన్లో జంట నగరాల్లో ఉన్నాయి. దీనికి తోడు 40 పోలీస్ స్టేషన్లో రావడంతో 150 పోలీస్ స్టేషన్ లకు హైదరాబాద్ నగరం చేరిపోయింది .దానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ప్రజలకు చేరువ కావాలనే ఆలోచనతోటి పోలీస్ శాఖ పోలీస్ స్టేషన్లో పరిధిని విస్తరించింది. దానికి తోడు ఫోన్ చేసిన కొన్ని క్షణాల్లోనే ప్రజల వద్దకు వెళ్లాలని ఆలోచనతోటి పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచేస్తున్నారు .దీనికి తోడు మహిళా భద్రత పైన ప్రభుత్వం అధిక దృష్టిని కేంద్రీకరించింది .ఇందులో భాగంగానే ప్రతి జోన్ లో కూడా మహిళా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే అన్ని పోలీస్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు కోసం ముగ్గురు పోలీస్ కమిషనర్లు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పోలీస్ సిబ్బంది అలాట్మెంట్ కూడా దాదాపుగా పూర్తి చేశారు. వాహనాల కు సంబంధించి కొంత అవంతరాలు ఏర్పడ్డ పడితే ఉన్న వాహనాలను అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. వచ్చే బడ్జెట్ నాటికి అన్ని అవంతరాలను అధిగమిస్తామని ముగ్గురు పోలీస్ కమిషనర్లు చెప్తున్నారు.
Train Tickets : పెంపుడు జంతువులకి ట్రైన్ లో ఆన్లైన్ టికెట్

Show comments