హుజురాబాద్‌లో ఊపందుకున్న పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోలింగ్ ఊపందుకుంది.. నియోజకవర్గంలో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.. ఉదయం పోలింగ్ ప్రారభమైనప్పటి నుంచి ఓటర్లు పోలింగ్ బూతుల దగ్గర క్యూ కడుతూనే ఉన్నారు.. అయితే, ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతానికి చేరింది.. ఇక, ఏ పోలింగ్ కేంద్రాన్ని చూసినా భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.. ఈ సారి పోటీపోటీగా ప్రచారం చేయడం.. అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు..
Read Also: మా పోలింగ్ ఏజెంట్లను ఇబ్బంది పెడుతున్నారు.. ఎస్పీకి బీజేపీ ఫిర్యాదు
Also Read
మరోవైపు, వీణవంక మండలం గణుముక్కలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. కౌశిక్ రెడ్డి నాన్‌లోకల్ అంటూ నినాదాలు చేశారు ఈటల వర్గీయులు, ఈ సందర్భంగా టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక, వీణవంక మండలం కోర్కల్‌లో టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.. ఇరుపార్టీల శ్రేణులు కొట్టుకున్నాయి.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.. ఇలా చెదురుమదరు ఘటనలు మినహా.. హుజురాబాద్ బైపోల్ ప్రశాంతంగానే సాగుతోంది.
- Tags
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!