Asifabad: కుక్క కరిచిన గేదె పాలు తాగిన గ్రామస్తులు భయంతో ఆస్పత్రి వద్దకు పరుగులు పెట్టారు. పాలు తాగిన 302 మంది గ్రామస్తులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. ఈ విచిత్రమైన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
Read also: Terror attack: హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన నిజాలు.. యువకులకు ఫిధాయీ దళాల పేరుతో శిక్షణ
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రానికి చెందిన పాడి రైతు కాసబోయిన నానయ్యకు 16 గేదెలు ఉన్నాయి. పాడి గేదెల పాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రెండు నెలల క్రితం ఓ గేదెను పిచ్చి కుక్క కరిచింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా గ్రామంలోని వందలాది మందికి గేదె పాలు, పెరుగు విక్రయించాడు. అయితే రెండు రోజుల క్రితం కుక్క కరిచిన గేదె దూడ చనిపోయింది. ఈ విషయం కాస్త ఆనోట ఈనోట వెళ్ళి నానయ్య దగ్గర పాలు, పెరుగు కొనేవాళ్లకి తెలియడంతో షాక్ తిన్నారు, భయంతో వణికిపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించి పంచాయతీ కార్యాలయంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నానయ్య నుంచి పాలు, పెరుగు కొనుగోలు చేసి వినియోగించిన 302 మందికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేశారు. బాధితుల్లో మండల అధికారులు కూడా ఉండడం గమనార్హం. కానీ పాలను వేడి చేసిన తర్వాత తాగితే ఎలాంటి ప్రమాదం ఉండదని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. అయితే దూడ పొదుగు వద్ద కొరికితే పాలు విషపూరితమయ్యే ప్రమాదం ఉందన్నారు. ముందస్తుగా యాంటీ రేబిస్ టీకాలు వేయించుకోవడం మంచిదని చెబుతున్నారు. గేదె పాలు తాగిన దూడ అయితే చనిపోయింది. కుక్క కరిచిన గేదెకు మాత్రం ఎలాంటి ప్రమాదం కాలేదు. అయితే దూడకు ఏమైనా అనారోగ్యం కారణంగానే చనిపోయి ఉంటుందని ఇందులో భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు గ్రామస్థులు.
ఆ విషయంలో.. ఎక్కువ వయసున్న ఆడవారికి అట్రాక్ట్ అవుతున్న అబ్బాయిలు?