NTV Telugu Site icon

టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం.. ఏకంగా 30 పాజిటివ్‌ కేసులు..!

కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ మొత్తం ఆన్‌లైన్‌కే పరిమితం అయ్యింది.. అయితే, సెకండ్‌ వేవ్‌ తర్వాత కాస్త సాధారణ పరిస్థితులు నెలకొనడంతో… క్రమంగా విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.. ఇదే సమయంలో.. అక్కడక్కడ కోవిడ్‌ కేసులు వెలుగు చూస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి.. తాజాగా, దుండిగల్‌ బహదూర్‌పల్లిలోని టెక్ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది… పలువురు విద్యార్థులకు కరోనా సోకడంతో సెలవు ప్రకటించారు యూనివర్సిటీ నిర్వాహకులు.. రేపటి నుంచి సానిటైజ్ చేసి తరగతులు నిర్వహిస్తామని యూనివర్సిటీ ప్రతినిధులు వెల్లడించారు..

మొదట ఇద్దరు విద్యార్థులకు జ్వరం రావడంతో.. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే.. టెక్ మహేంద్ర యూనివర్సిటీ మొత్తంగా 25 మంది విద్యార్థులకు , 5 మంది భోదన సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు చెబుతున్నారు.. ఈ విషయాన్ని మేడ్చల్ జిల్లా ఉప వైద్యాధికారి కూడా ధృవీకరించారు.