NTV Telugu Site icon

Medtronic’s: హైదరాబాద్‌ కు క్యూకడుతున్న విదేశీ కంపెనీలు.. రూ.3 వేల కోట్లతో ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌

Ktr

Ktr

Medtronic’s: తెలంగాణ రాష్టానికి విదేశీ కంపెనీలు క్యూకడుతున్నాయి. అయితే.. హైదరాబాద్‌లో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో మెడికల్‌ డివైజెస్‌ ఉత్పత్తిలో గ్లోబల్‌ లీడర్‌ అయిన మెడ్‌ట్రానిక్స్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు రూ.3 వేల కోట్లతో హైదరాబాద్‌లో మెడికల్‌ డివైజెస్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈమేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో మెడ్‌ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. చర్చల అనంతరం రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. మెడ్‌ట్రానిక్స్‌ నిర్ణయంపట్ల మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలతో పెట్టుబడులు తరలివస్తున్నాయనడానికి ఇంతకుమించిన నిదర్శనం మరొకటి లేదని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. అయితే.. అమెరికా వెలుపల వెడ్‌ట్రానిక్స్‌ అతిపెద్ద ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తుండటం విశేషం.

Read also: Toyota: టయోటా కీలక నిర్ణయం.. ఇక, నో వెయిటింగ్‌..!

సాంకేతిక ఆవిష్కరణలకు భారతదేశం గ్లోబల్ హబ్‌గా ప్రసిద్ధి చెందిందని మెడ్‌ట్రానిక్ సర్జికల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & ప్రెసిడెంట్ మైక్ మరీనారో అన్నారు. ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల కోసం వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా భారతదేశ సామర్థ్యాన్ని విశ్వసిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మెడ్‌ట్రానిక్‌కు వ్యూహాత్మక ప్రదేశంగా నిరూపించబడిందని అన్నారు. దేశంలో ఈ ప్రధాన పెట్టుబడిపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నందుకు గర్విస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడానికి , రోగుల ఫలితాలను మెరుగుపరిచే వినూత్న పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. వైస్ ప్రెసిడెంట్ & MEIC సైట్ లీడర్ దివ్య ప్రకాష్ జోషి మాట్లాడుతూ.. హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్, పురోగతికి ఆర్ అండ్ డిలో పెట్టుబడి పునాదని అన్నారు. ఇది రోగి ఫలితాలను మెరుగుపరచడానికి, ఆరోగ్య సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి, ఆర్థిక వృద్ధిని నడపడానికి మాకు సహాయపడుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్, హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్ ఎనేబుల్‌గా నిలిపాయని అన్నారు. అందుకే టెక్నాలజీ పైప్‌లైన్‌కు దోహదపడే కార్యకలాపాలతో ఇన్నోవేషన్‌కు ఆజ్యం పోసి, మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా పెట్టుబడి కేంద్రానికి గొప్ప సామర్థ్యాన్ని అన్‌లాక్ చేస్తుందని అన్నారు.