రథాన్ని విద్యుత్ తీగలు తగలడంతో.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో చోటుచేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో ఇటీవల రాములోరి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల అనంతరం స్వామి వారి ఊరేగింపు చేసే రథం ఆలయ సమీపంలో ఉండగా.. ఆ రథాన్ని ఆలయంలోకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పైన విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో విద్యుదాఘాతంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా మారింది.
Conjuring House: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన దెయ్యాల కొంప
ఈ ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. తీవ్రంగా గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారు కేతేపల్లి గ్రామానికి చెందిన రాజాబోయిన యాదయ్య (42), పొగాకు మొనయ్య (43), మక్కపల్లికి చెందిన కారు డ్రైవర్ దాసరి అంజి (20) గా గుర్తించారు. కాగా రథయాత్రలో ఈదుర్ఘటన జరగటంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Sai Pallavi: అరుదైన రికార్డ్.. హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్