హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.. జోహాన్నెస్ బర్గ్ నుండి హైదరాబాద్ వచ్చిన జాంబియాకు చెందిన ఓ ప్రయాణికుడి దగ్గర రూ.25 కోట్ల విలువ చేసే 3.2 కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నారు.. సినీ పక్కీలో మాదకద్రవ్యాలను మలద్వారంలో తరలిస్తుండగా.. కేటుగాళ్ల గుట్టురట్టు చేశారు.. ఇక, 3.2 కిలోల హెరెయిన్‌ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ మధ్య తరచూ దేశంలోని అంతర్జాతీయ విమనాశ్రయాల్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుపడుతూ వస్తున్నారు.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోనూ ఇప్పటికే పలు దపాలుగా హెరెయిన్‌ను పట్టుకున్న సంగతి తెలిసిందే.
శంషాబాద్‌లో రూ.25 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Shamshabad Airport