NTV Telugu Site icon

Hyderabad MMTS: నేటి నుంచి ఈ నెల 11 వరకు.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

Hyderabad Mmts

Hyderabad Mmts

Hyderabad MMTS: హైదరాబాద్ వాసులకు ఎంఎంటీఎస్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. నగరంలో 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మౌలాలి-సనత్ నగర్ మధ్య నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. నేటి 4వ తేదీ (ఆదివారం) నుంచి ఈ నెల 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మొత్తం 51 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. టైమ్ టేబుల్ ప్రకారం ఈ రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. ఈ నెల 9 వరకు మూడు ఎంఎంటీఎస్ రైళ్లు, 10 వరకు మరో రెండు, ఈ నెల 11 వరకు 18 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు. వీటితోపాటు మౌలాలి-అమ్ముగూడ-సనత్‌నగర్‌ మార్గంలో నడిచే హైదరాబాద్‌-సిర్పూర్‌-కాగజ్‌నగర్‌, వికారాబాద్‌-గుంటూరు, రాయపల్లె-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను షెడ్యూల్‌ ప్రకారం నిలిపివేస్తారు.

Read also: Harish Rao: ఆటో EMI కట్టలేకపోతున్నాం.. హరీష్‌ రావుతో ఆటో డ్రైవర్లు

అందుబాటులోకి రానున్న మరో టెర్మినల్..
హైదరాబాద్‌లోని చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టెర్మినల్‌ను ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి సిద్ధం చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం తెలిపారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా సనత్ నగర్ – మౌలాలి మధ్య రెండో లైను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్‌ను దాటుకుని కొన్ని రైళ్లను నడిపే అవకాశం ఉంటుందని వివరించారు.
Telangana Govt: పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు

Show comments