Labours stuck in Flood: వాగులో చిక్కుకున్న 23 మంది కూలీలు సేఫ్.. ఒడ్డుకు చేర్చిన సహాయక బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు భాగ్యనగరం సహా పలు జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. నగరవాసులతంగా ఇంకా ఐదురోజుల పాటు అప్రమత్తంగా వుండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్ నగరంతో పాటు మహబూబ్ నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్డ అలర్ట్ ఉంటుందని ప్రకటించింది. కాగా.. 4 రోజులు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న వెల్లడించారు. ఈనేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిదని సూచించారు. ఇక మరోవైపు రాష్ట్రంలో వానలు విజృంభించడంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మళ్లీ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈనేపథ్యంలో.. నిన్న (శుక్రవారం) ఉదయం కూలీలు పనులకు వెళ్లారు. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందపురం-జి.కొత్తపల్లి మధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న పాలేరు వాగులో 23 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకున్నారు. చుట్టూ నీరు ఉండటంతో రావడానికి అవకాశం లేకపోయింది. ఒడ్డుకు చేరుకోలేక సాయం కోసం ఎదురు చూసారు. విషయం తెలుసుకు పోలీసులు, NDRF వాగు వద్దకు చేరుకున్నారు. రాత్రి వాన కుండపోతగా కురుస్తుండటంతో.. కూలీలను తీసుకువచ్చేందుకు కొంత ఇబ్బంది ఎదురైంది. దీంతో వరదల్లో చిక్కుకున్న బాధితులకు డ్రోన్ కెమెరా సాయంతో ఆహారాన్ని పోలీసులు పంపించారు. బాధితులను కాపాడేందుకు NDRF బృందం రంగంలోకి దిగింది. 18 గంటలు రెస్క్యూ ఆపరేషన్ చేసి కూలీలను బయటకు తీసుకువచ్చారు. ఈరోజు ఉదయం 7 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ పూర్తిచేసారు. కూలీలను ప్రాణాలతో 18 గంటలు కష్టపడి బయటకు తీసుకువచ్చిన సహాయ బృందాలను బాధితులు ధన్యవాదాలు తెలిపారు.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కోట్యా తండా, చాంప్ల తండాకు చెంది 23 మంది కూలీలు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఓ రైతు కౌలుకు తీసుకున్నాడు. వానాకాలం పంట కోసం నాట్లు వేసేందుకు తానంచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కోట్యా తండా, చాంప్ల తండాకు చెందిన కూలీలు 23మంది ఉదయం ఆటోలో ముకుందాపురం గ్రామశివారు లోని పాలేరు ఏటి వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యం వరద ఉద్ధృతి పెరగడంతో కూలీలు అక్కడ చిక్కుకుపోయారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!