NTV Telugu Site icon

Holidays in 2023: 2023లో సెలవులు ఇవే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

Holidays

Holidays

2022కి బైబై చెప్పే సమయం వచ్చేసింది.. ఇప్పటికే నవంబర్‌లో ఉన్నాం.. మరో నెల గడిస్తే 2023కి రాబోతోంది.. ఈ నేపథ్యంలో 2023 ఏడాదిలో సెలవులపై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలీడేస్‌ లిస్టును ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ విడుదల చేశారు. మొత్తంగా వచ్చే ఏడాది 2023లో 28 జనరల్ హాలీడేస్‌ ఉండగా.. 5 ఆప్షనల్ హాలీడేస్‌ ఉన్నాయి.. వాటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పండగల కోసం, స్పెషల్ డేస్ కోసం 23 నోటిఫైడ్ సెలవులను ఫైనల్‌ చేశారు..

తెలంగాణ ప్రకటించిన సాధారణ సెలవులను ఓసారి పరిశీలిస్తే…
జనవరి 1 – న్యూఇయర్‌ (సండే)
జనవరి 14 – భోగి
జనవరి 15 – సంక్రాంతి (సండే)
జనవరి 26 – గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
మార్చి 7 – హోళీ
మార్చి 22 – ఉగాది
మార్చి 30 – శ్రీరామనవమి
ఏప్రిల్ 4 – బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి
ఏప్రిల్‌ 7- గుడ్‌ ఫ్రైడే
ఏప్రిల్ 14 – డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి
ఏప్రిల్ 22 – రంజాన్‌
మే 1 – మే డే
జూన్ 29 – బక్రీద్
జులై 17 – బోనాలు
జులై 29 – మొహర్రం
ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబర్‌ 7 – శ్రీకృష్ణాష్టమి
సెప్టెంబర్‌ 18 – వినాయక చవితి
సెప్టెంబర్‌ 28 – మిలాద్‌-ఉన్‌-నబి
అక్టోబర్ 2 – గాంధీ జయంతి
అక్టోబర్‌ 14-బతుకమ్మ ప్రారంభం రోజు
అక్టోబర్‌ 24 – విజయదశమి
నవంబర్ 12- దీపావళి
నవంబర్ 27- కార్తీక పూర్ణిమ, గురునానక్ జయంతి
డిసెంబర్‌ 25 – క్రిస్మస్
డిసెంబర్‌ 26-బాక్సింగ్‌డే ఉన్నాయి..

హాలీడేస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కింది టేబుల్‌లో పరిశీలించవచ్చు..

Show comments