NTV Telugu Site icon

Telangana School Education: 229 పని దినాలతో 2023-24 విద్యా సంవత్సరం

School

School

Telangana School Education: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు 2023-24 విద్యా సంవత్సరంలో 229 రోజుల పాటు పని చేయనున్నాయి. అక్టోబర్‌ 13 నుంచి 25 వరకు 13 రోజులపాటు దసరా సెలవులను ఇవ్వనున్నారు. క్రిస్టమస్‌కు డిసెంబర్‌ 22 నుంచి 26 వరకు 5 రోజులు.. సంక్రాంతి పండుగకు జనవరి 12 నుంచి 17 వరకు 6 రోజులపాటు ఇవ్వనున్నారు. అక్టోబర్‌లో ఎస్‌ఏ-1, ఏఫ్రిల్‌లో ఎస్‌ఏ-2 పరీక్షలను నిర్వహించనుండగా.. మార్చిలో ఎస్‌ఎస్‌సీ వార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు. 2023-24 విద్యా సంవత్సరంకు సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను పాఠశాల విద్య శాఖ మంగళవారం విడుదల చేసింది.

Read also: Minister Vidadala Rajini: ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభానికి రంగం సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరంకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ను విడుదల పాఠశాల విద్య శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది 229 పనిదినాలతో పాఠశాలలు కొనసాగనున్నాయి. జూన్‌ 12న పాఠశాలలు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పున: ప్రారంభించబడతాయి. ఫార్మేటీవ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)-1 పరీక్షను జులై 31న నిర్వహిస్తారు. ఎఫ్‌ఏ-2ను సెప్టెంబర్‌ 30న నిర్వహిస్తారు. సమ్మెటీవ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ)-1 పరీక్షలను అక్టోబర్‌ 5 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. అక్టోబర్‌ 13 నుంచి 25 వరకు దసరా సెలవులను ఇస్తారు.

Read also: Adipurush Final Trailer: పాపం ఎంత బలమైనది అయినా అంతిమ విజయం సత్యానిదే

ఎఫ్‌ఏ-3ని డిసెంబర్‌ 14న నిర్వహిస్తారు. ఎఫ్‌ఏ-4ను 10వ తరతి వారికి జనవరి 29న.. 1 నుంచి 9వ తరగతి వారికి ఫిబ్రవరి 29న నిర్వహిస్తారు. ఎస్‌ఏ-2 పరీక్షలను ఏఫ్రిల్‌ 8 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. 10వ తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్‌ పరీక్షలను ఫిబ్రవరి 29 లోపు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించే వార్షిక బోర్డు పరీక్షలను మార్చి 2024లో నిర్వహించనున్నారు. 2023-24 విద్యా సంవత్సరంకు సంబంధించి ఏఫ్రిల్‌ 23 చివరి పనిదినంగా నిర్ణయించారు. మొత్తంగా 229 పనిదినాలతో 2023-24 విద్యా సంవత్సరపు అకడమిక్‌ క్యాలెండర్‌ను పాఠశాల విద్య శాఖ రూపొందించింది.