NTV Telugu Site icon

HDFC Bank: బ్యాంక్ అకౌంట్లో రూ.18 కోట్లు… తర్వాతేమైంది?

Bank 1

Bank 1

మీకో బ్యాంక్ అకౌంట్ వుంది. అందులో వెయ్యో.. పదివేలో.. లక్షో డిపాజిట్ చేస్తుంటారు. అయితే మీ ప్రమేయం లేకుండానే అందులో కోట్ల రూపాయలు పడితే మీ గుండె ఆగిపోతుంది కాసేపు. కొంతమంది బ్యాంక్ కస్టమర్ల ఖాతాల్లో కోట్లరూపాయలు జమచేశారు HDFC బ్యాంక్ సిబ్బంది. అనుకోకుండా.. మీ బ్యాంక్ అకౌంట్లో.. ఒక్కసారిగా ఓ ల‌క్ష రూపాయలు వ‌చ్చి ప‌డితే…ఎలా ఉంటుంది? అదే ప‌ది ల‌క్షల రూపాయలు.. 18 కోట్లు అయితే మీ ఆశ్చర్యానికి అంతే వుండదు. సంతోషం ఉబ్బితబ్బిబవుతారు. అకౌంట్లో అంత మొత్తం చూస్తే.. తప్పకుండా షాక్ అవుతారు కదా…అలా అవాక్కైయ్యే ఘ‌ట‌న‌నే తెలంగాణ, తమిళనాడులో HDFC బ్యాంకు కష్టమర్లకు ఎదురైంది.

వికారాబాద్‌ జిల్లాలో వెంకటరెడ్డి అనే కస్టమర్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఒకటి కాదు రెండు కాదు ఒక్క సారిగా 18.52కోట్ల యాభై రెండు లక్షలు ఆయన అకౌంట్లో జమ అయినట్టు మెసేజ్ వచ్చింది. వికారాబాద్ పట్టణంలో మొబైల్ షాప్ నడుపుతాడు వెంకటరెడ్డి. Hdfc వికారాబాద్ బ్రాంచ్ లో ఈ ఘటన జరిగింది. అంత మొత్తం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే బ్యాంక్ అకౌంట్ ని ఫ్రీజ్ చేశారు అధికారులు. దీంతో తన ఖాతా నుంచి ఎటువంటి లావాదేవీలు జరగకపోవడంతో ఇబ్బంది పడ్డానంటున్నాడు వెంకటరెడ్డి.

చెన్నైలో ఓ వందమంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు త్యాగరాయానగర్ బ్రాంచ్ లో వినియోగదారుల‌కు ఈ అదృష్టం వ‌రించింది. ఏకంగా వారి ఖాతాలకు రూ13 కోట్ల చొప్పున డ‌బ్బు డిపాజిట్ అయ్యింది. దీంతో అందరూ బ్యాంకులకు పరుగులు తీశారు. ఎంటీఎంల్లో క్యూలు క‌ట్టారు. అయితే సాంకేతిక కారణాలతో కోట్లాది రూపాయలు డిపాజిట్ అయ్యిందని అధికారులు చెప్పటం, అ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడంతో అవాక్కయ్యారు కస్టమర్లు. ఐతే బ్యాంక్ అధికారులు ఇది టెక్నికల్ ఎర్రర్ గా చెబుతున్నారు. డబ్బు జమ అయిన అన్ని ఖాతాలను ఫ్రిజ్ చేశారు. నిన్న ఆదివారం అయినప్పటికీ ఒక కొత్త సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసుకునే క్రమంలో తలెత్తిన పొరపాటుగా చెబుతున్నారు అధికారులు.

Crime News: పెళ్ళికొడుకుని బలి తీసుకున్న వివాహేతర సంబంధం

Show comments