Durgam Cheruvu Bridge: కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి యువతి ఆత్మహత్య.. కారణం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
17 Year Old Girl Payal Commits Suicide By Jumping From Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్ నగరంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. మాధాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి.. ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడ్డ యువతిని కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు చెందిన పాయల్(17)గా గుర్తించారు. ఉద్యోగం నిమిత్తం ఈ యువతి జాబ్ కోసం నగరానికి వచ్చింది. జూబ్లీహిల్స్‌లోని ఒకరి ఇంట్లో హౌస్‌మేడ్‌గా చేరింది. సూసైడ్ చేసుకోవడానికి ముందు.. పాయల్ తన స్నేహితురాలితో కలిసి డీమార్ట్‌లో షాపింగ్ చేసింది. అక్కడి నుంచి వీళ్లిద్దరు నేరుగా కేబుల్ బ్రిడ్జికి వెళ్లారు. కేబుల్ బ్రిడ్జి ఫుట్‌ఫాత్‌పై సరదాగా మాట్లాడుకుంటూ కాసేపు నడిచారు. ఇంతలో పాయల్ కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఒక్కసారిగా దూకేసింది. పాయల్ చర్యతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఆమె స్నేహితురాలు.. పాయల్ చెరువులోకి దూకుకుండా కాపాడేందుకు ఆపే ప్రయత్నం చేసింది. కానీ.. ఆమె ప్రయత్నం విఫలమైంది.
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ..
భయంతో వణికిపోయిన పాయల్ స్నేహితురాలు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఆమె సమాచారం మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుర్గం చెరువులో పాయల్ మృతదేహం కోసం డీఆర్ఎఫ్ టీమ్ గాలిస్తున్నారు. పాయల్ సూసైడ్‌కి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఓ యువకుడ్ని పాయల్ గాఢంగా ప్రేమిస్తోందని, అయితే ఆమె కుటుంబసభ్యులు అందుకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసింది. కుటుంబీకులు తమ ప్రేమని అంగీకరించడం లేదు కాబట్టి, అతనితో తనకు పెళ్లి జరగదన్న మనస్థాపంతోనే పాయల్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Motkupalli Narasimhulu: నేనేమీ సన్యాసిని కాదు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!