NTV Telugu Site icon

Ys Sharmila: నేడు సంగారెడ్డిలో షర్మిల పాదయాత్ర.. జిన్నారంలో బహిరంగ సభ

Ys Sharmila

Ys Sharmila

సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరువు నియోజక వర్గంలో 165వరోజు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగతుంది. ఉదయం 10 గంటలకు అందూర్ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్న వైఎస్ షర్మిల. జిన్నారం మండల పరిధిలోని మియజిగూడ, సొలక్ పల్లి, దాడిగుడ మీదుగా పాదయాత్ర చేయనున్నారు షర్మిల. ఊట్ల మీదుగా జిన్నారం మండల కేంద్రానికి షర్మిల చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు జిన్నారంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభ అనంతరం మంగంపేట గ్రామం మీదుగా నర్సాపూర్ నియోజక వర్గంలో షర్మిల అడుగుపెట్టనున్నారు. హత్నూర్ మండలం రోయ్యపల్లి గ్రామంలో రాత్రికి బస చేయనున్నారు షర్మిల.

నిన్న సంగారెడ్డి, కంది మండలాల్లో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగింది. ఈనేపథ్యంలో.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. ఆయన కేటీఆర్ కోవర్ట్ అని, ఈ విషయం గాంధీ భవన్ మొత్తం తెలుసని ఆరోపించారు. వైఎస్సార్‌ తనని పార్టీలోకి పిలిచారని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. అసలు వైఎస్సార్ పార్టీ మారాడా? ఎప్పుడు మారాడు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్సార్ గెలిచిన పార్టీనే కాంగ్రెస్‌లో కలిసిపోయిందన్నారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారని.. పార్టీలు మారే ఖర్మ వైఎస్సార్‌కి పట్టలేదని కౌంటర్ ఇచ్చారు. ‘నీలా పార్టీలు మారి.. రాజకీయ వ్యభిచారం చేసే సంస్కృతి వైఎస్ఆర్‌ది కాదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Bigg boss 6: అందరి టార్గెట్ ఆమెనే… ఎందుకంటే..?