Job Notification: తెలంగాణలో నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త అందించింది. 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 న విడుదల అవుతుందని వెల్లడించింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 22 నుంచి దరఖాస్తులు మొదలు కానున్నాయి. అక్టోబర్ 14 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరించనున్నారు. నియామక పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో ఉండే అవకాశం ఉంది.
మొత్తం 1540 పోస్టులలో ఏఈఈ సివిల్ విభాగంలో 211 పోస్టులు, ఏఈఈ సివిల్ ఎంఏ అండ్ యూడీ పీహెచ్ విభాగంలో 147 పోస్టులు, టీడబ్ల్యూ డిపార్టుమెంట్‌లో 15, ఐ అండ్ సీడీ డిపార్టుమెంట్లో మొత్తం 704 ఖాళీలు (సివిల్ 320, మెకానికల్ 84, ఎలక్ట్రికల్ 200, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో 100), ఏఈఈ మెకానికల్ ఐ అండ్ సీఏడీ డిపార్టుమెంట్లో 03, ఏఈఈ (సివిల్) టీఆర్ అండ్ బీ విభాగంలో 145 ఉద్యోగాలు, ఏఈఈ ఎలక్ట్రికల్ టీఆర్ అండ్ బీ విభాగంలో 13 పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం https://www.tspsc.gov.in/website సందర్శించండి.
Read Also: Nasa: నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్లీ వాయిదా.. కారణం ఇదే..!!
అటు రవాణా విభాగంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) పోస్టుల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అర్హతల విషయంలో అభ్యర్థుల నుంచి టీఎస్‌పీఎస్సీకి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ విజ్ఞప్తులను టీఎస్‌పీఎస్సీ రవాణాశాఖకు తెలిపింది. కాగా, 113 AMVI పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ జులై 27న నోటిఫికేషన్ ఇచ్చింది.
