Site icon NTV Telugu

Uranium Smuggling India: తప్పిన ప్రమాదం.. యురేనియం ముఠా అరెస్ట్‌

Uranium Smuggling India

Uranium Smuggling India

ప్రమాదకరమైన యురేనియంను భారత్‌లోకి స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠాను ఇండో- నేపాల్‌ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్దనుంచి 2కేజీల యురేనియంతో సహా ఇతర అనుమానాస్పద వస్తువులు లభ్యమయ్యాయని తెలిపారు. మొత్తం 15 మందిని అదుపులో తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.

భారత్‌ లోకి 2 కిలోల యురేనియంను ఇండో-నేపాల్​ సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మొత్తం 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. అయితే వారివద్దకు యురేనియం ఎక్కడినుంచి వచ్చింది అనేది ఆరా తీస్తున్నారు. అయితే.. నేపాల్​ కాఠ్​మాండూ మీదుగా భారత్​ లోకి బిహార్​కు పేలుడు పదార్థాల్లో ఉపయోగించే ప్రమాదకర యురేనియంను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. సరిహద్దులోని బిరాట్​​నగర్​ వద్ద తనిఖీలు నిర్వహించగా.. నిందితులు పట్టుబడ్డారు. వారివద్దనుంచి యురేనియంతో పాటు మరికొన్ని అనుమానస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా.. బీహార్‌లోని అరారియా, జోగ్​బానీ నుంచి స్మగ్లింగ్​ కు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్మగ్లర్ల అరెస్టు అనంతరం భారత భద్రత సంస్థలు, సశస్త్ర సీమా బల్ అప్రమత్తమయ్యాయి. ఈనేపథ్యంలో.. సరిహద్దుల్లో భద్రతా చర్యలను మరింత పెంచాయి. పట్టుబడ్డ యురేనియం విలువ రూ. కోట్లలో ఉంటుందని, దీనిని అణ్వాయుధ తయారీలోనూ ఉపయోగిస్తారని వెల్లడించారు. అయితే.. ఒక కేజీ యురేనియం 24 మెగావాట్ల శక్తికి సమానమని, దీంతో విధ్వంసమే సృష్టించే అవకాశముందని, భద్రతా దళాల అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.

Minister Gudivada Amarnath: చంద్రబాబులా పబ్లిసిటీ కాదు.. ప్రజలకు సాయం చేయాలన్నదే మా ఆలోచన..

Exit mobile version