కరోనా సెకండ్ వేవ్ సంక్షోభం సమయంలో పేదలను అండగా నిలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. సడలింపులు ఉన్న రంగాలు తప్పితే.. లాక్‌డౌన్‌తో అంతా ఇళ్లకే పరిమితం అవుతుండడంతో.. పేదలకు తినడానికి తిండిలేక.. దాతల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంది.. అయితే.. పేదల కడుపు నింపేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. జూన్ నెలలో ప్రతీ వ్యక్తికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేయనున్నారు.. దీంతో.. రాష్ట్రంలోని 2 కోట్ల 79 లక్షల 24 వేల 300 మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.. రాష్ట్రంలోని మొత్తం 87లక్షల 42వేల 590 కార్డులకు ఎలాంటి పరిమితి లేకుండా 4లక్షల 31వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందిచనున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవడానికి 5 కిలోల చొప్పున ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
కేసీఆర్ గుడ్‌న్యూస్.. రేషన్‌కార్డుపై ప్రతీ వ్యక్తికి 15 కిలోల ఉచిత బియ్యం
Gangula Kamalakar