ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం అతలాకుతంలమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద నీరు రావడంతో గ్రామాలు, జిల్లాలు, మండలాలు జలమయమయ్యాయి. ఇండ్లలో నీరు చేరి జనం అవస్థలు ఎదుర్కొంటుంటే మరో పక్క నిలవ నీడలేక వర్షానికి ఇండ్లు నేలమట్టమై ప్రజలు భయాందోళనతో ప్రాణాలు అరిచేతిపెట్టుకుని బిక్కు బిక్కు మంటు కాలం గడుపుతున్నారు. మరొకొన్ని చోట్లు ప్రజలు నీల్లలో కొట్టికుపోయిన దాఖలాలు వున్నాయి. అయితే ఈనేపథ్యంలో.. వర్షానికి ప్రజలే కాదు.. జంతువులు కూడా మృత్యువాత పడ్డాయి. మేతకు వెళ్లిన ఆవులు మృతి చెందడంతో.. బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లలో జరిగింది.
read also: Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. రేపు అఖిలపక్ష భేటీ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. రోజులాగే అడవికి మేతకు వెళ్ళిన 140 ఆవులు విగతజీవులుగా మారాయి. అయితే వారితోపాటు వెళ్లిన మిగతా 89 ఆవుల దొరకడం లేదు. ఈఘటన వీరపల్లి మండలం మద్దిమల్ల, రుద్రంగి మండలం డేగావాత్ తండాలో శుక్రవారం జరగడంతో అందరిని కలిచివేస్తోంది. అయితే.. మద్దిమల్లతండాకు చెందిన 23 మంది రైతులకు సంబంధించిన 129 ఆవులను మూడు రోజుల క్రింతం సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లారు. చీకటి పడినా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన వారు వార్షం కురుస్తున్నా లెక్కచేయకుండా వెతకడానికి వెళ్లారు. కొద్ది దూరంలో 80 ఆవులు మృతి చెందగా మరో.. 49 ఆవుల కోసం గాలిస్తున్నారు. అయితే రుద్రంగి మండలం దేగావత్ తండా, కున్‌సోత్ తండా, జోత్యతండాలకు చెందిన వంద ఆవుల్లో 60 మృత్యువాత పడగా.. మరో 40 ఆవుల ఆచూకీ దొరకడం లేదు, దీంతో బాధితులు కన్నీమునీరయ్యారు. ఆవులన్నీ మృతి చెందడానికి గల కారణం శరీర ఉష్ణోగ్రత తగ్గడంతోనే అని పశువైద్యాధికారులు పేర్కొన్నారు. ఆవులు కోల్పోయి మిగతా ఆవులు కనిపించకుండా పోవడంతో.. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
Krishna River Management Board: తెలుగు రాష్ట్రాలకు లేఖ అనుమత్తుల్లేని వాటిని ఆపండి..