గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది.. కరోనా మహమ్మారి రాష్ట్రంలో అడుగుపెట్టిననాటి నుంచి గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సేవలు మరువలేనివి.. కనిపించని మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్నారు.. గాంధీని కోవిడ్ ఆస్పత్రిగా మార్చి సేవలు అందిస్తోంది ప్రభుత్వం.. ఇదే సమయంలో.. పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది కూడా కోవిడ్ బారినపడుతుండడంతో.. మిగతా వారిలో ఆందోళన మొదలైంది.. తాజాగా.. మరో 120 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. వీరిలో 40 మంది పీజీ విద్యార్థులు, 38 మంది హౌస్ సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీలు ఉన్నారు.. మరికొంత మంది వైద్యులు, వైద్య సిబ్బందికి సంబంధించిన కరోనా టెస్ట్ రిపోర్టులు రావాల్సి ఉంది.. కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.. దీంతో గాంధీ ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది, రోగుల్లో ఆందోళన మొదలైంది.
Read Also: మళ్లీ కేసీఆర్ ప్రెస్‌మీట్.. కఠిన ఆంక్షలు తప్పవా..?
