NTV Telugu Site icon

Revanth Reddy Cabinet: రేవంత్ రెడ్డి కేబినెట్‌లో 11 మంది మంత్రులు.. ఒకే జిల్లా నుంచి ఆ.. ముగ్గురు !

Revanth Reddy Cabinet

Revanth Reddy Cabinet

Revanth Reddy Cabinet: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. అయితే.. ఖమ్మం జిల్లాకి ఒకేసారి ముగ్గురు మంత్రులుగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఇలా ముగ్గురు మంత్రులు ఒకే జిల్లా నుంది ఎన్నుకోవడం ఇదే మొదటి సారి. గతంలో ఒకసారి ఇద్దరు మంత్రులు ఒకేసారి చేసిన చరిత్ర ఉంది… కానీ ముగ్గురు మంత్రులు ఒకే జిల్లా నుంచి కేబినెట్ లో చోటు దక్కడం మాత్రం ఇప్పుడే రాబోతుంది. జిల్లాకి మొట్టమొదటిసారిగా మధుర నియోజకవర్గ నుంచి శీలం సిద్ధారెడ్డి మంత్రిగా వస్తే ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం గా మల్లు భట్టి విక్రమార్క రానున్నారు.

ఇకపోతే మొదటి మంత్రిగా జిల్లాలో శీలం సిద్ధారెడ్డి ఉండగా.. రెండవసారి మంత్రిగా జలగం వెంగళరావు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికవగా.. అదే సత్తుపల్లి నియోజకవర్గ నుంచి జలగం వెంగళరావు రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కూడా ఎంపికయ్యాడు .ఆ తర్వాత కొత్తగూడెం నుంచి కోనేరు నాగేశ్వరరావు మంత్రి అయ్యారు. ఆ తర్వాత సత్తుపల్లి నుంచి తుమ్మల నాగేశ్వరరావు, జలగం ప్రసాదరావు లు మంత్రి కాగా పాలేరు నియోజకవర్గం నుంచి సంభానీ చంద్రశేఖర్ మంత్రి అయ్యారు. ఇకపోతే వైయస్సార్ ప్రభుత్వంలో స్తంభాని చంద్రశేఖర్ వనమా వెంకటేశ్వరరావులు ఇద్దరు కూడా మంత్రి పదవిని అనుభవించారు. వారిద్దరూ కూడా అప్పటిలో వైద్య ఆరోగ్య శాఖ నీ పంచుకున్నారు.

Read also: Floods: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం.. వరదలో కొట్టుకుపోయిన ముగ్గురు గిరిజనులు

ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ప్రభుత్వంలో రామిరెడ్డి వెంకట్రెడ్డి పాలేరు నియోజకవర్గ నుంచి మంత్రి కాగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం నుంచి మంత్రి గా వ్యవహరించారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా.. భట్టి విక్రమార్క ఉండగా అదే రోజుల్లో మంత్రిగా రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాకి ప్రాతినిధ్య వహించనున్నారు. ముగ్గురు మంత్రులు ఒకరు డిప్యూటీ సీఎం కానున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయితే.. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇకపోతే ఒకేసారి ముగ్గురు మంత్రులు అయిన సందర్భం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. జిల్లాల విభజన జరిగిన తర్వాత ఒక ఖమ్మం జిల్లాకే ముగ్గురు మంత్రులు వచ్చారు.. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, మధుర నుంచి డిప్యూటీ సీఎం మంత్రిగా బట్టి విక్రమార్క వ్యవహరించనున్నారు. కాగా ఈ జిల్లాకి కేంద్ర మంత్రులుగా రంగయ్య నాయుడు రేణుక చౌదరి లు పని చేసిన విషయం తెలిసిందే.

Pragathi Bhavan: ప్రగతి భవన్ ముందున్న బ్యారికేడ్స్ నుంచి వెహికిల్స్..