Site icon NTV Telugu

Bike Accident : పదో తరగతి విద్యార్థి ప్రాణాలు తీసిన బైక్‌ మోజు..

యుక్తవయసులో బైక్‌అంటే అందరికీ ఇష్టమే.. బైక్‌పై స్నేహితులకు ఎక్కించుకొని షికారు కొట్టాలనే సహజం. అయితే 18 సంవత్సరాలు నిండిన తరువాతే బైక్‌ డ్రైవింగ్‌, కారు డ్రైవింగ్‌కు అర్హులు. అయితే.. ఈ విషయాన్ని పక్కన పెట్టి కొందరు యువకులు డ్రైవింగ్‌ చేస్తూ ప్రాణాల పొగొట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇది.. మహమ్మద్ అనే పదో తరగతి విద్యార్థి తన స్నేహితులతో కలిసి బైక్‌పై వెళుతున్నాడు. ఆ బైక్‌ను కూడా ఇంట్లో వాళ్లకు తెలియకుండా బయటకు తీసుకువచ్చాడు.

అయితే.. మహమ్మద్ నడుపుండగా.. రాజేంద్రనగర్‌లోని ఉప్పర్ పల్లి 194 పిల్లర్ నెంబర్ వద్దకు రాగానే మోటర్ సైకిల్ అదుపు తప్పి మహమ్మద్‌ కిందపడ్డారు. దీంతో మహమ్మద్‌ తలకు తీవ్ర గాయమైంది. తలకు బలమైన గాయంకావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు మహమ్మద్‌. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని మహమ్మద్‌ ఇంట్లో వారికి చేరవేయడంతో.. చెట్టు అంత కొడుకు మరణవార్తను విని తల్లడిల్లి పోయారు తల్లిదండ్రులు.

Exit mobile version