NTV Telugu Site icon

TG SSC Supplementary Results 2024: రేపు పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు..

Ssc

Ssc

రేపు ( శుక్రవారం ) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌దవ త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు రిలీజ్ కానున్నాయి. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల‌ను ఈ వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లో చూసుకోవ‌చ్చు అని చెప్పుకొచ్చారు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్‌ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.

Read Also: Chiranjeevi on Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ సక్సెస్‌పై మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్

ఇక, తెలంగాణ టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షల ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 30న విడుద‌ల అయ్యాయి. పదో తరగతి వార్షిక‌ ఫ‌లితాల్లో 91.31 ఉత్తర్ణత శాతం వచ్చింది. బాలిక‌లు 93. 23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం సాధించారు. 3, 927 స్కూల్స్‌లో 100 శాతం పర్సెంటేజ్ న‌మోదు అయింది. ఆరు స్కూల్స్‌లో జీరో ఉత్తర్ణత శాతం న‌మోదు కాగా.. గ‌తేడాది 89.60 శాతం ఉత్తర్ణీత న‌మోదు అయింది. ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది. మొత్తం 5, 05, 813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు.. 4,91,862 మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. కాగా, ఈ ఏడాది పదవ తరగతి వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు నిర్వహించారు. వీటికి 5, 08, 385 స్టూడెంట్స్ హాజరయ్యారు. వీరిలో 2, 57, 952 మంది బాలురు, 2, 50, 433 మంది బాలికలు ఉన్నారు.