Site icon NTV Telugu

హాట్ టాపిక్‌: ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్

భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొని తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఇటీవల అన్ని పార్టీల ముఖ్యనేతలతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈటల ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీలో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఈటల రాజేందర్ తో పాటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా వెళ్లాల్సి ఉండగా, కరీంనగర్ లో ఆలస్యం కావడంతో రేపు ఢిల్లీ వెళ్లనున్నాడు. కాగా, ఈటల రేపు ఢిల్లీ పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీజేపీలో ఈటల రాజేందర్‌కు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రెండు రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఢిల్లీ టూర్ తో ప్రాధాన్యత ఏర్పడింది.

Exit mobile version