Site icon NTV Telugu

సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్

సీఎం కేసీఆర్‌ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్‌ విసిరారు. సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారా ? లేదా ? అని చార్మినార్ వేదిక నుండి కేసీఆర్ కి సవాల్ విసురుతున్నానని తెలిపారు. బండి సంజయ్‌ పాదాయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పాత బస్తి కి మెట్రో రైలు రాక పోవడానికి కారణం ఒవైసీ అని… పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండి పడ్డారు. హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎన్ని కుట్రలు పన్నిన హుజూరాబాద్ లో గెలిచేది బీజేపీ నేనని స్పష్టం చేశారు. పాద యాత్ర తో కేసీఆర్ సర్కారు పీఠాలు కదులుతాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా… తెలంగాణ లో గెలిచేది బీజేపీ పార్టీనేనని వెల్లడించారు కిషన్‌ రెడ్డి.

Exit mobile version