NTV Telugu Site icon

సీఎం అంటే జ‌గ‌నే.. ఏపీ సీఎంపై కోమ‌టిరెడ్డి ప్ర‌శంస‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌శంస‌లు కురిపించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భాగంగా నకిరేకల్ మున్సిపాల్టీలో ప్ర‌చారం నిర్వ‌హించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అంటే వైఎస్ జ‌గ‌నే అన్నారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వెయ్యి రూపాయలు దాటిన వైద్యం అంతా ఆరోగ్య శ్రీలోనే అన్న ఆయ‌న‌.. కరోనా ట్రీట్ మెంట్ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారంటూ ప్ర‌శంసించారు.. అయితే, క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి ప్ర‌జ‌లు ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ల‌క్ష‌లు త‌గ‌లేస్తున్నార‌ని.. మ‌రి తెలంగాణ‌లో క‌రోనా ట్రీట్‌మెంట్‌ను ఎందుకు ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి తేవ‌డం లేదంటూ సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డారు కోమ‌టిరెడ్డి.. ఓటు వేసే ముందు… నీ కొడుక్కి ఉద్యోగం వచ్చిందా..? మీకు ఇళ్లు వ‌చ్చాయా? లేదా? అనేది ఆలోచించి ఓటు వేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అయితే, ఉన్న‌ట్టుండి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై కోమ‌టిరెడ్డి ప్ర‌శంస‌లు కురిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.