Site icon NTV Telugu

మహిళలకు శుభవార్త.. నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

ప్రతీ ఏడాది తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం… ఇక, ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చే చీరల పంపిణీ ఇవాళ ప్రారంభం కానుంది.. ఇప్పటికే జీహెచ్‌ఎంసీతో పాటు ఆయా జిల్లాల్లో చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. రాష్ట్రంలో అర్హులైన మహిళలకు చీరల పంపిణీ శనివారం నుంచి చేస్తామని టెస్కో ఎండి శైలజా రామయ్యర్‌ వెల్లడించారు.. ఆహారభద్రత కార్డు కింద పేర్లు నమోదైన 18 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రభుత్వం తరఫున బతుకమ్మ చీరలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.. ఇక, ఈ ఏడాది 96 లక్షల మందికి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది కేసీఆర్ సర్కార్.. 20 విభిన్న రంగులతో 30 డిజైన్లను రూపొందించి 810 రకాల చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు. కరోనా మహమ్మారి దృష్ట్యా.. కరోనా నిబంధనలను పాటిస్తూ.. కలెక్టర్ల పర్యవేక్షణలో బతుకమ్మ చీరల పంపిణీ జరగనుంది.. ఇక, ఈ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల్లో మంత్రుల ప్రారంభించనున్నారు.

Exit mobile version