NTV Telugu Site icon

Divya Vani: అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను..

Divya Vani

Divya Vani

Divya Vani Comments After Joins in Congress: బంగారు తెలంగాణ కాంగ్రెతోనే సాధ్యమని సినీ నటి, రాజకీయ నేత దివ్య వాణి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను మరింత ఆసక్తిగా మారుస్తూ బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ మణిక్ ఠాక్రే ఆమెకు కండువా కంపి ఫార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నీతి, నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌లో పనిచేయాలనే హస్తం పార్టీలో చేరానన్నారు. విజయశాంతి కూడా కాంగ్రెస్ చేరారని పేర్కొన్నారు.

Also Read: Bandi Ramesh: భర్త గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం.. రోడ్ షోలో పాల్గొన్న బండి లకుమాదేవి

విజన్ కలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర గతంలో పనిచేయడం ఆనందంగా ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల టీడీపీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి పేదవాడు బాగుపడాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే నియంత పాలకులను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. అహంకార ప్రభుత్వంలో బానిస బ్రతుకులనుండి బయట పడేందుకు కాంగ్రెస్ రావాలని, ప్రజల భవిష్యత్తును కాపాడడం, దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. కార్యకర్తగా తనకు ఏ పని అప్పగించినా బాధ్యతగా పనిచేస్తా. ప్రగతి భవన్ కాదిది ప్రజాభవన్ తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిందని, ఆ అంశం తనకు బాగా నచ్చిందని దివ్వ వాణి తెలిపారు.

Also Read: Bhatti Vikramarka: మాదాపూర్, హైటెక్ సిటీలా.. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి…

Show comments