NTV Telugu Site icon

Telangana Elections 2023: తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు నమోాదైన పోలింగ్

Telangana Assembly Election

Telangana Assembly Election

Telangana Elections Live Updates: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. దీంతో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. అయితే తెలంగా వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు చూస్తే అత్యధికంగా మెదక్ జిల్లాలో 70 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 51.89 శాతం పోలింగ్ నమోదైంది.

జిల్లాలుగా పోలింగ్ శాతం వివరాలు

1. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తంగా 62.34 శాతం నమోదైన పోలింగ్
2. భద్రాద్రి 58.38 శాతం నమోదైంది
3. హనుమకొండ 49 శాతం నమోదైంది
4. హైదరాబాద్ 31.17 శాతం నమోదైంది
5. జగిత్యాల 58.64 శాతం నమోదైంది
6. జనగాం 62.24 శాతం నమోదైంది.
7. భూపాలపల్లి 64.30 శాతం నమోదైంది.
8. గద్వాల్ 64.45 శాతం నమోదైంది.
9. కామరెడ్డి 59.06 శాతం నమోదైంది
10. కరీంనగర్ 56.04 శాతం నమోదైంది.
11. ఖమ్మం 63.62 శాతం నమోదైంది.
12. ఆసిఫాబాద్ 59.62 శాతం నమోదైంది.
13.మహబూబాబాద్ 65.05 శాతం నమోదైంది.
14. మహబూబ్ నగర్ 58.89 శాతం నమోదైంది.
15. మంచిర్యాల 59.16 శాతం నమోదైంది.
16. మెదక్ 69.33 శాతం నమోదైంది.
17. మేడ్చల్ 38.27శాతం నమోదైంది.
18. ములుగు 67.84శాతం నమోదైంది
19. నాగర్ కర్నూల్ 57.52 శాతం నమోదైంది.
20. నల్గొండ 59.98 శాతం నమోదైంది.
21. నారాయణపేట 57.17 శాతం నమోదైంది.
22. నిర్మల్ 60.38 శాతం నమోదైంది.
23. నిజామాబాద్ 56.50 శాతం నమోదైంది.
24. పెద్దపల్లి 59.23శాతం నమోదైంది.
25. సిరిసిల్ల 66.66శాతం నమోదైంది.
26. రంగారెడ్డి 42.43శాతం నమోదైంది.
27. సంగారెడ్డి56.23 శాతం నమోదైంది.
28. సిద్దిపేట 64.91 శాతం నమోదైంది.
29. సూర్యాపేట 62.07 శాతం నమోదైంది.
30. వికారాబాద్ 57.62 శాతం నమోదైంది.
31. వనపర్తి 60.10 శాతం నమోదైంది.
32. వరంగల్ 52.28 శాతం నమోదైంది.
33. యాదద్రి 64.08శాతం పోలింగ్ నమోదైంది.