జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలకు కోత పెట్టి రైతులకి సాగు నీటి కోసం తొమ్మిది గంట విద్యుత్ అందించాము అని ఆయన తెలిపారు. విద్యుత్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు.. ఒక ఎకరానికి 3 గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70కి పైగా స్థానాలను గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Harish Rao: వైఎస్సార్‌టీపీని విలీనం చేసేందుకు వచ్చిన నాయకులకు స్వాగతం
జిల్లాలో యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన జరుగుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులను విధుల్లో నుండి తొలగించాలి.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకానికి అనుమతులు మంజూరు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన అధికారులను తక్షణమే విధుల్లో నుండి తొలగించాలి అని ఆయన డిమాండ్ చేశారు. విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Read Also: KCR Comments: పెద్ది సుదర్శన్ రెడ్డిని ఓడించేందుకు షర్మిల డబ్బు కట్టలు పంపుతుందట
ఎన్నికల కమిషన్ ఒకవైపు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు చూస్తుంటే.. మరో వైపు జగిత్యాల జిల్లాలో యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ అధికారులకు అనుమతులు మంజూరు చేస్తుండడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జిల్లాలో యంత్రాంగం ఉందా అనే అనుమానం కలుగుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 437లో మట్టి తవ్వకాలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మైనింగ్ అధికారులు క్వారీకి అనుమతులు మంజూరు చేశారన్నారు.