NTV Telugu Site icon

Mallikarjun Kharge: తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో..

Mallikarjuna Karge

Mallikarjuna Karge

Mallikarjun Kharge: ఇవాళ హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏఐసీసీ చీఫ్ తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో అని ఆయన చెప్పారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడ్డారు.. కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుంది.. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నది.. మోడీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు.. ఎప్పుడూ ఫార్మ్ హౌస్‌లోనే ఉండే కేసీఆర్ ఇక.. అక్కడే ఉండిపోతరు.. జనాలు బై బై కేసీఆర్.. టాటా కేసీఆర్ అంటరు అని మల్లికార్జున ఖర్గే చెప్పుకొచ్చారు.

Read Also: IND vs AUS: భారత్‌-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్.. విజేత కెప్టెన్‌కు ట్రోఫీని అందజేయనున్న..! లక్కీ ఫెలో

విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చాము అని మల్లికార్జున ఖర్గే అన్నారు. జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే.. జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారు.. ప్రాజెక్టులు, పథకాలు, ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడుతున్నారు.. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ఇచ్చినట్టే.. ఇక్కడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. కర్ణాటకలో చెప్పిన ప్రతి హామీనీ మేం నెరవేరుస్తున్నాం.. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను బరాబర్ అమలు చేసి తీరుతాం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేబినెట్ ఏర్పాటైన తొలి రోజే వాటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మా తొలి లక్ష్యం మహాలక్ష్మి పథకం ప్రతి నెలా 2500, 500కే గ్యాస్, బస్సుల్లో ఫ్ర్రీ జర్నీ పథకాలపై చేస్తామని మల్లికార్జున ఖర్గే చెప్పారు.