NTV Telugu Site icon

Mallikarjun Kharge: అహంకార సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలి..

Mallikarjuna Kharge

Mallikarjuna Kharge

తెలంగాణ ఎన్నికల సమయంలో దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని ప్రచారంలో దూకుడు పెంచాయి. అలాగే మద్దుతుగా ఆయా పార్టీల జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం నల్గొండలో ప్రచారం చేపట్టారు. నల్గొండ చేరుకున్న ఖర్గే.. మొదట ఫ్లోరైడ్‌తో పోరాడి చనిపోయిన అంశల స్వామికి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

Also Read: ‘Panauti’ row: ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

అహంకార సీఎం కేసీఆర్‌ను గద్దె దింపాలని నల్గొండ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీకి బీజేపీ, హైదరాబాద్‌కు బీఆర్ఎస్ ఒక్కటే..మోడీ, కేసిఆర్ పాలనలో పేదల జీవితాలు దుర్భరంగా మరాయని మండిపడ్డారు. ఇందిరమ్మ మహా నేత.. ఆమెపై కేసిఆర్ చేస్తున్న విమర్శలను నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నాగార్జున సాగర్ లాంటి గొప్ప ప్రాజెక్ట్ ఇందిరా గాంధీ నిర్మించారని ఆయన గుర్తు చేశారు. నాగార్జున సాగర్ నిర్మాణం జరిగి ఉండకపోతే… వరి సాగుకు తెలంగాణ ధాన్యాగారం అయ్యేదా? అని ప్రశ్నించారు. దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చింది ఇందిరమ్మ అని ఖర్గే పేర్కొన్నారు.

Also Read: YSRCP: జనసేనకు బిగ్‌షాక్‌.. వైసీపీలో చేరిన జనసేన కీలక నేతలు