Rahul Gandhi slams to KCR: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాహుల్ గాంధీ రోడ్ షోలో మాట్లాడుతూ.. చాలా దూరం నుంచి చాలా మంది నన్ను చూడడానికి వచ్చారు అని అన్నారు. తెలంగాణ రాజకీయ సంబంధం కాదు రక్త సంబంధం జవహర్ లాల్.. ఇందిర గాంధీ, రాజీవ్ సోనియా గాంధీతో మీకు సంబంధాలు ఉన్నాయి.. కాంగ్రెస్ రాష్ట్రానికి ఏమి చేసిందో నేను చెబుతాను కేసీఆర్.. మీరు చదివిన స్కూల్ కాంగ్రెస్ పార్టీదే నడిచే రోడ్డు కూడా కాంగ్రెస్ పార్టీ వేసింది అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ యువ శక్తితో కాంగ్రెస్ కట్టింది.. 10 ఏళ్లుగా తెలంగాణనీ దోచారు దానికి అంతం పలికే రోజు వచ్చింది అని రాహుల్ గాంధీ విమర్శించారు.
Read Also: Quinton de Kock: క్వింటన్ డికాక్ అరుదైన ఘనత.. గిల్‌క్రిస్ట్, ధోనీకి కూడా సాధ్యం కాలేదు!
ఒక్క వైపు కుటుంబ పాలన మరో వైపు పేద ప్రజలు ఉన్నారు అని రాహుల్ గాంధీ అన్నారు. మంత్రి వర్గంలో డబ్బులు ఉన్న పదవులు మీరే తీసుకున్నారు.. ప్రజలకు కావలసిన తెలంగాణను కలగన్నారు.. ఆయన అవినీతి ప్రతి దగ్గర కనిపిస్తోంది.. ఒక్క లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో మోసం చేశారు.. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు అని ఆయన వ్యాఖ్యనించారు. తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ సీఎంలకు ఏమి చెబుతున్నాను అదే కేసీఆర్ కు కూడా చెబుతున్నాను.. అన్ని లక్షల కోట్లు ప్రజలకు పంచి పెట్టాలని కాబోయే కాంగ్రెస్ సీఎంకు చెబుతున్నాను అని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Komatireddy Raj Gopal Reddy: లింగయ్యను ఖతం చేస్తా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్య
కేసీఆర్ అన్ని లక్షల కోట్లు ఏం చేశాడో.. అన్ని లక్షల కోట్లు మీ అకౌంట్ లో వేస్తాము అని రాహుల్ గాంధీ చెప్పారు. 12 వందల సిలిండర్ ధరను 500 రూపాయలకే రాబోతుంది.. ప్రతి నెల 2500 బ్యాంక్ అకౌంట్ లలో మహిళలకు వేస్తాను.. 24 గంటల ఉచిత కరెంట్ వస్తుంది అని కేసీఆర్ అంటున్నారు.. అది ఆయన ఇంటికి మాత్రమే పరిమితం అయింది.. కేసీఆర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళారు కాబట్టి ఆయన 24 గంటల కరెంటు వస్తుందని అనుకుంటున్నారు అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.