రైతు బంధును అనుమతిని ఎన్నికల కమిషన్ రద్దు చేయడంతో బీఆర్ఎస్ ఎంపీ కే. కేశవ్ రావు స్పందించారు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం.. ఇది ఏ పార్టీలకు సంబంధించినది కాదు అని తెలిపారు. రైతు బంధు వ్యవసాయ పనులకు సంబంధించిన అంశం.. ఇప్పుడు కోర్టుకు పోలేము.. ఎందుకంటే కోర్టులు ఎన్నికల విషయాల్లో జోక్యం చేసుకోవు అని ఆయన చెప్పుకొచ్చారు. నేను సీఈఓతో రైతుబంధు విషయంపై చర్చించాను.. ఆయన కూడా బాధపడ్డాడు.. నాలుగు కోట్ల మందికి సంబంధించిన విషయం.. ఈసీ నోటీసులు కూడా ఇవ్వలేదు.. మంత్రి హరీష్ రావు మీద ఆరోపణలు చేశారు అంటూ ఎంపీ కేశవ్ రావు పేర్కొన్నారు.
Read Also: Ponguleti: కేసీఆర్ కలల్ని పగటి కలలు చేయాలి.. కాంగ్రెస్ ను ఆదరించాలి
అవసరం అనుకుంటే మంత్రి హరీష్ రావుపై చర్యలు తీసుకుంటే సరిపోయేది అని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కే. కేశవ్ రావు తెలిపారు. కొత్త లబ్ధిదారులను చేర్చొద్దు అని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.. ఈసీ నిబంధనలు అన్నీ మేము పాటిస్తున్నాము.. ఈసీ మాకు లీగల్ నోటీస్ ఇస్తే దానికి మేము సమాధానం చెప్పే వాళ్ళం.. ఈసీఐకి ఎక్స్ ప్లీనరీ నోట్ పంపిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రైతుబందు ఆన్ గోయింగ్ స్కీం.. ఇది ప్రజాస్వామ్యమా? ఇంకేమన్నానా? అని ఎంపీ కే. కేవశ్ రావు ప్రశ్నించారు.