బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన కాచిగూడ బాలప్పబాడ, లింగంపల్లి కురుమ బస్తీ, చెప్పల్ బజార్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేరు వెంకటేషన్ మాట్లాడుతూ.. ఢిల్లీ రిమోట్‌తో పనిచేసే ఎమ్మెల్యే కావాలా? స్థానికంగా ఉండి సమస్యలు పరిష్కరించే ఎమ్మెల్యే కావాలా? ఆలోచించి ఓటు వేయాలని అంబర్ పేట నియోజకవర్గం ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు.
Also Read: YS Sharmila: పదేళ్లు తెలంగాణలో జరిగింది దోపిడీ,దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన
ఈరోజు అంబర్ పేటలో అమిత్ షా, రేవంత్ రెడ్డి ఇద్దరు రోడ్డు షో నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ప్రజలు ఆలోచించి స్థానికంగా ఉండే అభ్యర్థికి ముఖ్యంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారని, కర్ణాటకలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని అమలు చేసి వాళ్ళు ఇక్కడ ప్రచారం చేస్తే బాగుంటుండేదని ఆయన హితవు పలికారు. కాగా ఈ కార్యక్రమంలో కాలేరుకు మద్దుతుగా కాచిగూడ డివిజన్ అధ్యక్షుడు భీష్మ దేవ్,ప్రజలు బిఆర్ఎస్ నాయకులు, మహిళా నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ బీఆర్ఎస్ గెలుపుకు తిరుగులేదు – కాలేరుకి అడ్డు లేదు అన్న నినాదాలతో కాచిగూడ హోరెత్తింది.
Also Read: Muralidhar Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు నాటకం ఆడుతున్నాయి.. అధికారంలోకి వచ్చేది మేమే
