Jare Adinaryana wins Aswaraopeta Assembly Constituency: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లెక్కింపు ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బోనీ కొట్టింది. ఖమ్మం జిల్లాకు చెందిన అశ్వరావుపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ 28 వేల మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక్కడ ఆయన తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మెచ్చా నాగేశ్వరరావు మీద గెలుపొందారు. మెచ్చా నాగేశ్వరరావు 2018 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచి ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయనకే విఆర్ఎస్ టికెట్ కేటాయించగా కాంగ్రెస్ పార్టీ మాత్రం జారే ఆదినారాయణకు టికెట్ కేటాయించింది. ఇక ఈ స్థానంలో సిపిఐ అభ్యర్థికి మూడో స్థానం లభించినట్లు తెలుస్తోంది.
Congress on Lead: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీల ‘బ్యానర్’లకు పాలాభిషేకం
Big Breaking: బోణీ కొట్టిన కాంగ్రెస్.. అశ్వరావుపేటలో గెలుపు
![Adinarayana Mla](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2023/12/Adinarayana-mla.jpg)
Adinarayana Mla